కోముసుబి దెబ్బ ఓజెకి చిత్తు | Japan's Summer Grand Sumo Tournament | Sakshi
Sakshi News home page

కోముసుబి దెబ్బ ఓజెకి చిత్తు

May 30 2026 12:07 PM | Updated on May 30 2026 12:30 PM

Japan's Summer Grand Sumo Tournament

విల్‌ పవర్‌

పిల్లలూ... ఇది సుమో పోటీ. అంటే జపాన్‌ కుస్తీ పోటీ. అక్కడ ‘సమ్మర్‌ గ్రాండ్‌ సుమో టోర్నమెంట్‌’ జరుగుతోంది. ఈ పోటీలో ‘ఓజెకి’ కిరిషిమానును ‘కోముసుబి’ వాకాతకకాగె మట్టికరిపించాడు.

ఇది పెద్ద విశేషమే. ‘ఓజెకి’, ‘కోముసుబి’ అనేవి సుమో వీరుల ర్యాంకులు. ఓజెకి అంటే సెకండ్‌ ర్యాంక్‌ లాంటివాడు. చాలా పెద్ద ఫైటర్‌. కోముసుబి అంటే 4వ ర్యాంక్‌. కొంచెం చిన్న ర్యాంక్‌. ఇక్కడ  4వ ర్యాంక్‌ పిల్లాడు 2వ ర్యాంక్‌ అన్నయ్యని ఓడించేశాడు. క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ ఇండియాని ఓడిస్తే ఎలా ఉంటుందో అలాంటిది!

ఫోటోలో కుడివైపున ఉన్నది పెద్ద వీరుడు (కిరిషిమానును). అతన్ని నెడుతున్నవాడు చిన్న వీరుడు (వాకాతకకాగె). పోటీలో చిన్నవీరుడు గెలిచాడు. కాబట్టి మనం గట్టిగా పట్టుపడితే ఎవరినైనా ఓడించగలం. గుర్తు పెట్టుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement