ఆటో నడిపి.. నడిపించి... | Jancy B V from Bengaluru turned her struggles into independence | Sakshi
Sakshi News home page

ఆటో నడిపి.. నడిపించి...

Mar 26 2026 5:52 AM | Updated on Mar 26 2026 5:52 AM

Jancy B V from Bengaluru turned her struggles into independence

ఒకప్పుడు అరకొర జీతం కోసం ఫ్యాక్టరీలో గంటల తరబడి శ్రమించిన ఆమె .. నేడు ఆటో స్టీరింగ్‌ చేత పట్టి వేలమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే ఝాన్సీ బి.వి.. బెంగళూరు, బన్నెరఘట్ట శివార్లలో పెరిగిన ఆమె బాల్యమంతా చాలా కష్టంగా గడిచింది. జాన్సీకి 12 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి మద్యపానానికి బానిసై మరణించడంతో కుటుంబ భారం మొత్తం తల్లిపై పడింది. దీంతో కుటుంబం కోసం ఎలాగైనా ఆర్థిక చేయూతనివ్వాలని ఆమె నిర్ణయించుకుంది. చదువు మధ్యలోనే ఆపేసి, గార్మెంట్‌ ఫ్యాక్టరీలో టైలర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. కానీ గంటల తరబడి చేసే ఆ ఉద్యోగం ఆమెకు నచ్చలేదు. 

2011లో వివాహం తర్వాత, తన భర్తతో కలిసి ఒక టీ స్టాల్‌ ప్రారంభించింది. అయితే, అందులోనూ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది. 2016లో ఆమె భర్త ఇచ్చిన ఒక చిన్న సలహా ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడానికి, ఇంటి పనులకు పనికొస్తుందని ఆమెకు ఆటో డ్రైవింగ్‌ నేర్పించారు. మొదట్లో భయపడినప్పటికీ, భర్త ప్రోత్సాహంతో స్టీరింగ్‌ పట్టిన ఝాన్సీ.. ధైర్యం చేసి ప్రయాణికులను ఎక్కించుకోవడం ప్రారంభించింది. మొదటి రోజు సంపాదన (రూ.700) ఆమెలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 2018లో కమర్షియల్‌ లైసె¯Œ ్స ΄÷ంది పూర్తిస్థాయి ఆటో డ్రైవర్‌గా మారిన ఝాన్సీ.. రోజూ 10 నుంచి 12 గంటల పాటు ఆటో నడుపుతుంది. 

ఇపుడు బెంగళూరు వీధుల్లో ఆమె ఒక సుపరిచితమైన వ్యక్తి. అంతేకాదు కేవలం తాను ఆటో నడపడానికే పరిమితం కాకుండా తనలాగే కష్టాల్లో ఉన్న ఎంతోమంది మహిళలకు ఆటో డ్రైవింగ్‌ నేర్పించి, వారు సొంతంగా బతికేలా ప్రోత్సహిస్తోంది. నేడు ఆమె వద్ద శిక్షణ ΄÷ందిన ఎంతోమంది మహిళలు బెంగళూరు రోడ్లపై ఆటోలు నడుపుతూ తమ కుటుంబాలను ΄ోషించుకుంటున్నారు. తన పిల్లలను మంచి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చదివిస్తున్న ఝాన్సీ, తన జీవితం మారినట్టే ప్రతి మహిళా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలదని బలంగా నమ్ముతోంది. ఒకప్పుడు కూలి పనులకు వెళ్లిన కుటుంబం నుంచి వచ్చి, నేడు ఒక మెంటార్‌గా ఎందరో మహిళలకు ‘స్టాండ్‌ ఆన్‌ యువర్‌ ఓన్‌ ఫీట్‌’ అనే సందేశాన్ని నిజం చేసి చూపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement