How Powerful Jet Blast Is Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: విమానం టేకాఫ్‌ అవుతున్న టైంలో అక్కడే ఉన్నారా? అంతే సంగతి

Jun 25 2023 5:12 PM | Updated on Jun 26 2023 3:16 PM

How Powerful Jet Blast Is Video Goes Viral On Social Media - Sakshi

విమానం టేకాఫ్‌ అవుతుండగా సమీపంలో ఎవరూ ఉండరు. ఎందుకంటే దాని ఇంజన్‌ నుంచి వచ్చే గాలి ఫోర్స్‌కి తాళ్లలేం. అందుకే ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు విమానం టేకాఫ్‌ అవుతుందనంగా ఎవర్నీ రానీయరు, వారు ఉండరు. కానీ ఇక్కడో బృందం విమానం టేకాఫ్‌ అవుతుండగా అక్కడే ఉంది. ఆ విమానం ఇంజిన్‌ దెబ్బకు ఒక్కసారిగా వారంతా చెల్లా చెదురుగా అయిపోతారు. ఏదో పెద్ద గాలి తుఫానులా ..వారందర్నీ పడగొడుతున్నట్లు ఉంటుంది.

నిజానికి వారంతా ఆ విమానం రన్‌వేకి సరిహద్దు సమీపంలో ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో విమానం ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధం అవుతుంది. ఇక అంతే ఆ విమానం వెనుక ఉన్న ఇంజన్‌ నుంచి వచ్చే శక్తివంతమైన గాలికి అక్కడున్నవారంతా నిలబడటమే కష్టమైంది. ఏమవుతుందో తెలుసుకునేలోపే చెదిరిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!)

Advertisement
 
Advertisement
Advertisement