ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు.. | Groom Books Flight To Travel With Family For Wedding | Sakshi
Sakshi News home page

ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు..

Feb 12 2023 6:30 PM | Updated on Feb 12 2023 6:30 PM

Groom Books Flight To Travel With Family For Wedding - Sakshi

బంధుమిత్రులను తన పెళ్లికి తీసుకెళ్లేందుకు ఏకంగా విమానాన్నే  బుక్ చేశాడు ఓ పెళ్లికొడుకు. వాళ్లతో కలిసి  ఆకాశమార్గంలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

ఈ వరుడి పేరు భువన్. చాలా రిచ్.  అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా విమానం మొత్తాన్ని బుక్ చేశాడు. ఇతనితో పాటు ప్రయాణించిన బంధువులు ఫుల్ జోష్‌లో కన్పించారు. కెమెరాకు లవ్ సింబల్‌తో పోజులిచ్చారు.

భువన్ కూడా తన హావభావాలతో నవ్వులు పూయించాడు. చేతులకు మెహిందీ కూడా పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. నువ్వు రిచ్‌ ఆ కాదా చెప్పనవసరం లేదు, ఇలా విమానం బుక్‌ చెస్తే చాలు అందరికీ అర్థమయిపోతుంది అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో నెటిజన్‌ స్పందిస్తూ జీవితంలో ఇంత డబ్బు ఉంటే చాలు హ్యాపీగా బతికేయొచ్చు అని రిప్లై ఇచ్చాడు.
చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్..

Advertisement
 
Advertisement
Advertisement