Fashion: నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం!

Fashion: Kalamkari Madhubani Designs On Dresses New Look - Sakshi

కృష్ణ సౌందర్యం

నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు ఆధ్యాత్మికతనే కాదు వన్నె తగ్గని సౌందర్యాన్ని చూపుతాడు ఆ కళను ఫ్యాషన్‌ ప్రియులు తమ డిజైనర్‌ డ్రెస్సుల మీదకు తీసుకొచ్చి మరింత చూడముచ్చటగా తీర్చుతున్నారు.  వాటిని ఎంపిక చేసుకున్నవారు అంతే ఆనందంగా తమ కళాత్మక హృదయాన్ని చాటుతున్నారు. 

కలంకారీ, మధుబని, పటచిత్ర.. మన దేశంలోని కళారూపాలన్నింటిలోనూ కృష్ణ సౌందర్యం మన కళ్లకు కడుతూనే ఉంటుంది. సంప్రదాయ చీరలు, కుర్తీలు, దుపట్టాల మీద మనకు ఈ సొగసైన కళ కొత్త కాంతులతో రూపుకడుతూనే ఉంది.

బాల్యంలో చేసిన అల్లరి పనులు, రాధాకృష్ణుల ప్రణయ ఘట్టం, గోవుల కాపరిగా, యశోదా తనయుడిగా .. దుస్తుల మీద కొలువుదీరిన మురళీధరుడు ఫ్యాషన్‌ ప్రియులకు ఆరాధ్యుడయ్యాడు. కృష్ణుడి అలంకారంలో భాగమైన నెమలి పింఛం, పిల్లన గ్రోవి, శ్యామవర్ణం.. యువత మదిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అందుకే, స్త్రీ పురుషులిద్దరి వెస్ట్రన్‌ డ్రెస్సుల మీదా ఈ అలంకారాలు పెయింటింగ్‌గా అమరుతున్నాయి. ఎంబ్రాయిడరీగా అలరారుతున్నాయి. ఆభరణాలుగా మెరుస్తున్నాయి. బ్యాగుల అలంకరణలో ముఖ్య భూమిక అవుతున్నాయి. ఫ్యాషన్‌ వేదికల మీదా వినూత్న హంగులతో నడయాడుతున్నాయి.   

చదవండి: Saiee Manjrekar: ఈ హీరోయిన్‌ ధరించిన అనార్కలీ సెట్‌ ధర 46 వేలు! జరియా లేబుల్‌ వేల్యూ అదే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top