
దాండియా ఆటలు.. ఆడ.. సరదా పాటలు పాడ అంటూ నగర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలకు ఏర్పాటు జరుగుతున్నాయి. వేడుకలను సంబరంగా నిర్వహించేందుకు పలువురు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మిగిలిన ఈవెంట్స్‌కు భిన్నంగా మొత్తం 10 రోజుల పాటు సందడి కొనసాగడమే నవరాత్రి సంబరాల ప్రత్యేకత. ఈ 10 రోజులూ దాండియా–గర్భా నృత్యాల హోరులో నగరవాసులు మునిగితేలనున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ డీజేలు, ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఫ్లీ మార్కెట్స్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సంప్రదాయంతో పాటు ఆధునికతనూ కలగలిపి డిజైన్ చేస్తున్న ఈవెంట్స్ సకుటుంబ సపరివార సమేతంగా అలరించనున్నాయి.
క్లబ్స్‌తో పాటు, ఫంక్షన్ హాల్స్, ఉద్యానవనాలు, ఓపెన్–ఎయర్ వేదికలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఈ దాండియా/గర్భా ఈవెంట్స్‌కు వేదికలుగా మారనున్నాయి. ప్రధానంగా బ్యాండ్ ప్రదర్శనలు, డీజే, ఫుడ్ స్టాల్స్, వంటివి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. టికెట్ ధరల విషయానికి వస్తే కొన్ని ఈవెంట్స్ బడ్జెట్–ఫ్రెండ్లీగా ఉంటే, సగటున రూ.500 ధరలో అందుబాటులో ఉన్నాయి.
అయితే ఏదైనా పెద్ద ఈవెంట్స్, సెలబ్రిటీ ప్రదర్శనలు ఉంటే లేదా ప్రీమియం వేదిక అయితే ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఈవెంట్స్ సెపె్టంబర్ 20 నుంచి ప్రారంభమై, నవరాత్రి ముగిసే వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలో జరిగే కొన్ని కార్యక్రమాల గురించిన సమాచారం ఇది..
ఓపెన్ ఎయిర్ వేడుక..
నగరంలోని అతిపెద్ద ఓపెన్–ఎయిర్ వేదిక అయిన జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో హైదరాబాద్ దాండియా ఉత్సవ్ జరుగుతుంది. ఇది 10 రోజుల పాటు నృత్యం, సంగీతం సహిత వేడుకలను అందిస్తుంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. ఓపెన్–ఎయిర్ సెటప్, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్, మొత్తం ఫెస్టివ్ అలంకరణతో ప్రాంగణం కనువిందు చేస్తుంది.
ఈ బేగంపేట్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో ఎస్‌కే నవరాత్రి ఉత్సవ్ పేరిట ఈ నెల 22న రాత్రి 7గంటల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఢమాల్‌గా నిర్వాహకులు అభివరి్ణస్తున్న ఈ ఈవెంట్‌లో డీజే డాన్ సింగ్ ఓ ఆకర్షణ. ఫుడ్, పానీయాలు, బహిరంగ వినోద వేదికలు.. సిద్ధం చేశారు.
ఈమాదాపూర్‌లోని యూలో ఎరీనాలో నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ డీజే మ్యూజిక్ అందిస్తున్నారని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ పీర్జాదిగూడలోని శ్రీ పలణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22న దాండియా మహోత్సవ్ సీజన్ 3 పేరిట నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా అలరించేలా తమ ఈవెంట్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.
ఈసారి ఈ ఈవెంట్‌ను ఫ్లీ మార్కెట్‌తో మేళవించి అందిస్తున్నారు. బైరమల్‌గూడలోని ఎడుకంటి రామ్ రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే రస్ గర్భా వాల్యూమ్ 7 ఫ్లీ మార్కెట్ అండ్ ఎక్స్‌పో.. ఓ వైపు నవరాత్రి సంబరాల నృత్యాలతో పాటు షాపింగ్, ఫుడ్.. వంటివి మేళవిస్తోంది. మొత్తం 3 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవం ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ ఉప్పల్‌లోని శ్రీ పళణి కన్వెన్షన్స్‌లో ఈ నెల 22 రాత్రి 7గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ దాండియా సంబరాలు కొనసాగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సంబరాల్లో లైవ్ ఢోల్, డీజే షోస్, ఫుడ్ స్టాల్స్, సెలబ్రిటీల రాక.. వంటివి ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు.
ఈనోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వహిస్తున్నారు. లైవ్ మ్యూజిక్, డీజేలు, సెలబ్రిటీల ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్
ఉంటాయి.
నవరాత్రి ఉత్సవాలకు పేరొందిన నామ్‌ధారి గౌరవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నవరాత్రి ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.
కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరంగ్ నైట్స్ పేరిట దాండియా నైట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4.30గంటలకు ప్రారంభం కానుంది. గర్భా, దాండియా నృత్యాలు, ఫొటోగ్రఫీ అవకాశాలు.. ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయ గర్భాను డిస్కో లైట్లు, ఆధునిక సంగీతంతో మిళితం చేసే డిస్కో దాండియా ఏఎమ్‌ఆర్ ప్లానెట్ మాల్‌లో జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్యూజన్ ఈవెంట్ అని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు.
ఈ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షలో 11 రోజుల పాటు డోలా రే డోలా పేరిట నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు.
బుకింగ్స్.. ప్లానింగ్స్..
ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
కుటుంబ సమేతంగా హాజరయ్యేవారు వేదికల సమాచారం, పార్కింగ్ సౌకర్యం, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలు ముందుగా సరిచూసుకుని ప్లాన్ చేయడం అవసరం.
ఈ నృత్యాలు చేసే అలవాటు ఉంటే అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి దగ్గరలోని
ఈవెంట్ ఎంచుకుంటే బెటర్.
ఈ కొన్ని ఈవెంట్స్‌లో థీమ్ నైట్‌లు ఉంటాయి. కాబట్టి హాజరయ్యే ఈవెంట్‌కి సంబంధించి థీమ్/డ్రెస్ కోడ్ ఉంటే వాటి వివరాలు ముందుగా తెలుసుకోవడం అవసరం.
ప్రస్తుతం వాతావరణ మార్పులు అనూహ్యంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈవెంట్ రద్దయ్యే పరిస్థితుల్లో సందర్శకులకు ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి.
టికెట్ కొనుగోలుకు బుక్ మై షో, హై యాపె, డిస్టిక్ట్, టిక్కెట్స్ 99 వంటి అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించడం మేలు. స్ట్రీట్ కాజ్ పేరిట 21న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దాండియా నైట్స్ జరుగనుంది.
22 నుంచి అక్టోబర్ 2 వరకు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌లో ఢోలా రే ఢోలా పేరిట మెగా ఫెస్ట్.
నాగోలు శ్రీరాంగార్డెన్స్‌లో 27, 28 తేదీల్లో దాండియా ఢోల్ భాజే పేరిట వేడుకలు.
నగరంలోని టీబీఏ వేదికగా 22న నవరాత్రి బతుకమ్మ, దాండియా నృత్యాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమాజీగూడ ది పార్క్ హోటల్‌లో 24 నుంచి అక్టోబర్ 2 వరకు డిస్కో దాండియా.
నాగోలు శుభం కన్వెన్షన్ సెంటర్‌లో 27న నాచో దాండియా పేరిట నవరాత్రి ఉత్సవాలు.
బేగంపేట చిరాన్‌పోర్ట్‌లో 22 నుంచి అక్టోబర్ 2 వరకూ పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవ్ పేరిట హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ధమాల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.