
కీలకమైన ఆపరేషన్‌ల కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) తొలిసారిగా ఉమెన్ కమాండో టీమ్‌ను ప్రారంభించింది. వందమంది మహిళా సీఐఎస్‌ఎఫ్‌లకు ఫిట్‌నెస్, వెపన్స్ హ్యాండ్లింగ్, లైవ్–ఫైర్ డ్రిల్స్‌లాంటి ఆపరేషన్ స్కిల్స్, రన్నింగ్, అబ్‌స్టకిల్ కోర్సులు, రఫెలింగ్, సర్వైవల్ ఇన్ ఫారెస్ట్స్, 48 గంటల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్‌సైజ్‌లు... మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు.
మధ్యప్రదేశ్‌లోని బర్వాహత రీజనల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్‌టిసి)లో శిక్షణ మొదలైంది. శిక్షణ పూర్తి చేసుకున్న తొలిబ్యాచ్ మహిళలు ఎయిర్΄ోర్ట్స్‌లాంటి సున్నిత ప్రాంతాలలో విధులు నిర్వహిస్తుంది.
(చదవండి: బ్యాట్ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...)