
ఈ వరుడు పల్లకీలో రాలేదు. పూలతో అలకరించిన కారులో రాలేదు. ఏకంగా... సూపర్ హీరో బ్యాట్‌మన్ వాహనం బ్యాట్‌మొబైల్‌పై వచ్చాడు. థాయ్‌లాండ్‌లో షూట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో వరుడు ఫెనిల్ బ్యాట్‌మొబైల్‌పై, వాహనానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు.
వరుడి ఉత్సాహం మాట ఎలా ఉన్నా చాలామంది నెటిజనులు ‘వృథా ఖర్చు’ అని, ‘ఇలా డబ్బు వృథా చేసే బదులు మంచి పనులకు ఉపయోగించవచ్చు కదా’ అంటూ విమర్శలు కురిపించారు.
కొందరు మాత్రం... ‘భారతీయ వరుడిని కూడా ఇలాంటి బ్యాట్‌మొబైల్‌పై చూడాలనుకుంటాం’ అని స్పందించారు.
(చదవండి: టీనేజర్లకు థైరోకేర్ వ్యవస్థాపకుడి అమూల్యమైన సలహా..! అదే నిజమైన పేరెంటింగ్)