breaking news
women commando team
-
మత్తుని చిత్తు చేసిన మహిళా యోధులు..!
మత్తును చిత్తు చేసిన మహిళా యోధులు ‘భూమాత అంత ఓపిక మహిళల సొంతం’ అంటారు. సహనానికి పర్యాయ పదంలా చెప్పే ‘మహిళ’ అవసరమైతే అపర కాళీ అవుతుంది.కేరళ నుంచి పంజాబ్ వరకు ఎన్నో ప్రాంతాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మహిళలు నడుం బిగించారు. సంఘాలుగా ఏర్పడిఎన్నో గ్రామాలను డ్రగ్స్ భూతం నుంచి విముక్తి చేశారు...ఛత్తీస్‌గఢ్‌లోని జూహ్లీ గ్రామంలో ఒకప్పుడు పరిస్థితి భయానకంగా ఉండేది. ఈ గ్రామంలో ఎంతోమంది మాదకద్రవ్యాలకు బానిస అయ్యారు. ఫలితంగా గ్రామంలో శాంతిభద్రతలు లోపించాయి. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియదు. మత్తులో పడి పని కూడా మానేసేవారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి గ్రామ మహిళలు నడుం బిగించారు.‘ఉమెన్ కమాండోస్’ పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ఈ గ్రూప్ సభ్యులు వీధి వీధిలో పెట్రోలింగ్ చేసేవారు. ‘మా అలవాటు మా ఇష్టం. మీకెందుకు?’ అని అడ్డంగా వాదించే మొండిఘటాలను కూడా దారిలోకి తెచ్చారు. ఇప్పుడు గ్రామంలో పూర్తిగా మార్పు వచ్చింది. మద్యం, మాదకద్రవ్యాల విష కోరల నుంచి బయటపడి ఆదర్శ గ్రామంగా మారింది జూహ్లీ. ఈ మార్పుకు కారణం...ఉమెన్ కమాండోస్. ‘ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లలో కొందరు డ్రగ్స్ తీసుకునేవారు. ఆ దురలవాటు చివరికి యువత, పిల్లల్లోకి కూడా వచ్చింది. ఇలా చూస్తూ పోతే గ్రామం సర్వనాశనం అయి΄ోతుందని భయపడ్డాం. ఉమెన్ కమాండోస్ గ్రూప్‌గా ఏర్పడ్డాం. మార్పు సాధ్యం కాదు అనుకున్నచోట మార్పు తెచ్చాం’ అంటుంది ‘ఉమెన్ కమాండోస్’ గ్రూప్ సభ్యురాలు విష్ణుదేవి.‘మాదకద్రవ్యాల వాడకం వల్ల గృహహింస ఎక్కువ అయింది. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారింది. మేము ఉమెన్ కమాండోస్ పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడినప్పుడు మార్పు తేవడం మీ వల్ల కాదు అన్నారు కొందరు. కచ్చితంగా అవుతుంది అని నిరూపించాలనుకున్నాం. నిరూపించాం’ అంటుంది రాజేశ్వరి మారవీ. శైలి(పేరు మార్చాం)కి సరదాగా డ్రగ్స్ అలవాటు మొదలైంది. చివరికి ఈ దురలవాటు తనను మృత్యువు అంచుల వరకు తీసుకువెళ్లింది. పంజాబ్‌లో శైలిలాంటి ఎంతోమంది మహిళలను డ్రగ్స్ మృత్యునీడ నుంచి బయటకు తీసుకువచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చింది హెర్మిటేజ్ రిహాబ్ సెంటర్.మాదక ద్రవ్యాల బారిన పడిన మహిళలను కుటుంబ సభ్యులు ఈసడించడం, దూరం పెట్టడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యేది. పురుషుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండే రిహాబిలిటేషన్ సెంటర్లు మహిళలను చేర్చుకోవడానికి నిరాకరించేవి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెర్మిటేజ్ రిహాబ్ కేంద్రం మొదలైంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఈ ఆల్–ఉమెన్ డ్రగ్ రిహాబ్ సెంటర్లో చేరుతుంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.మహిళలే కీలకంమరోవైపు చూస్తే...మాదకద్రవ్యాల వ్యతిరేకపోరాటంలో, మాదకద్రవ్యాల బారిన పడిన వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మహిళలను కీలక భాగస్వాములను చేస్తోంది పంజాబ్ ప్రభుత్వం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘మాదకద్రవ్యాల బారిన పడిన వాళ్లను అందులో నుంచి బయటికి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉంది’ అంటున్నారు పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి డా.బల్బీర్‌సింగ్.బెదిరింపులు వచ్చినా...డ్రగ్స్‌పై పోరాడుతున్న మహిళలకు డ్రగ్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. దాడులు జరిగాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు. మహిళా యోధుల పట్టుదల ముందు డ్రగ్ మాఫియా తోకముడిచింది.బాధ పడకూడదు... పోరాడాలిపంజాబ్లోని బఠిండా జిల్లాలోని దులేవాలా గ్రామంలో పదకొండు మంది మహిళలతో ఏర్పాటైన ‘ఆల్–ఉమెన్ యాంటీ–డ్రగ్ అవేర్నెస్ కమిటీ’ గ్రామంలోని డ్రగ్స్ భూతాన్ని తరిమేసింది. సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ షిందర్ పాల్ కౌర్ ఈ కమిటీకి నాయకత్వం వహించింది. ‘డ్రగ్స్ వల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతోమంది దారి తప్పి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నం ఫలించింది’ అంటుంది షిందర్ పాల్ కౌర్. (చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..) -
వీవీఐపీ భద్రతకు మహిళా కమెండోలు
న్యూఢిల్లీ: సుశిక్షితులైన కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్పీఎఫ్)కు చెందిన తొలి మహిళా కమెండోల బృందం దేశంలోని వీవీఐపీలకు త్వరలో భద్రత కల్పించనుంది. హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ దంపతులు సహా పలువురు వీవీఐపీల భద్రతా బాధ్యతల్లో సీఆర్పీఎఫ్ మహిళా కమెండోలు పాలుపంచుకోనున్నారు. వీవీఐపీలు ఇంట్లో ఉన్నపుడు రక్షణ, నిఘా బాధ్యతలు చూస్తారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అగ్రనేతలు పర్యటించినపుడు మహిళా కమెండోలు వీరి వెన్నంటే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తంగా 32 మందితో సిద్ధమైన కమెండోల దళాన్ని రంగంలోకి దింపనున్నారు. ఆయుధాలు లేకుండానే శత్రువుతో పోరాడటం, అన్ని రకాల ఆయుధాలను వాడే నైపుణ్యం, డేగ కళ్లతో చుట్టూరా చూస్తూ వీవీఐపీలకు పొంచి ఉన్న ముప్పును పసికట్టడం, భద్రత కల్పించడం తదతర అంశాల్లో వీరంతా 10 వారాల కఠోర శిక్షణను పూర్తిచేశారు. వచ్చే ఏడాది జనవరిలో వీరిని విధుల్లోకి తీసుకుంటారని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ముందుగా ఢిల్లీలో జెడ్+ కేటగిరీలో ఉన్న అమిత్, మన్మోహన్ దంపతులు తదితరుల రక్షణ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు వీవీఐపీలు బస చేసిన ఇంట్లో తనిఖీ బాధ్యతలు వీరివే. -
దండకారణ్యంలో ‘దంతేశ్వరి’ బెటాలియన్
చర్ల: దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతలో మహిళా కమాండోలు దూసుకెళ్లనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల కట్టడికి సిబ్బంది కొరత సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్.. డీఆర్జీ బలగాల నుంచి కొందరు మహిళలను ఎంపికచేసి ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ బృందానికి ‘దంతేశ్వరి బెటాలియన్’ అనే పేరు పెట్టారు. వీరిని కూంబింగ్ ఆపరేషన్లకు వినియోగించనున్నారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ మహిళా కమాండోలకు ప్రత్యేక కిట్లు, అధునాతన ఆయుధాలనిచ్చి దండకారణ్యానికి తరలిస్తున్నారు. -
టెర్రరిజానికే టెర్రర్
మనదేశంలో ఇప్పటివరకు పురుషులకే పరిమితమై ఉన్న మరో రంగాన్ని స్త్రీ శక్తి బద్దలు కొట్టి కొత్త చరిత్రను సృష్టించింది. మగవారి కంటే తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని సగర్వంగా నిరూపించింది. అదీ కూడా.. ఉగ్రవాద, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ఉద్దేశించిన ప్రత్యేక పోలీసు భద్రతా బలగంలో ధీరవనితగా నిలిచి విధులు నిర్వహించబోతోంది. భారత పోలీసు బలగంలో మహిళలతో పోల్చితే మగవారి సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే చూసినా.. కేవలం 7 శాతం మాత్రమే యువతులున్నారు! ఇది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 33 శాతం కంటే ఎంతో తక్కువ. ఇలాంటి నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా 36 మందితో కూడిన ‘మహిళా కమాండో బృందం’ తాజాగా ఢిల్లీలో విధుల్లో చేరింది. తీవ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఏర్పాటై, అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక బృందం ఇంతవరకు మరే పోలీసు ఫోర్సు లోనూ లేదు. ఢిల్లీ పోలీసు విభాగంలోకి తీసుకున్న ఈ బృందాన్ని ‘స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీమ్’ (స్వాట్)గా పిలుస్తున్నారు. పూర్తిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులతోనే ఏర్పాటైన ఈ టీమ్ తన ప్రారంభ విధిగా.. వచ్చే బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమై ఉంటుంది. ఈ సందర్భంగా ఐదు పురుష కమాండో బృందాలతో సమానంగా ఈ టీమ్ విధులను నిర్వర్తిస్తుంది. 15 నెలల కఠోర శిక్షణ బందీలను విడిపించడం, బాంబులు పేలకుండా చేయడం, బిల్డింగ్లు ఎక్కడం, ఇతర విభాగాల్లో శిక్షణతో పాటు వివిధరకాల ఆధునిక ఆయుధాల వినియోగం, కౌంటర్ టెర్రరిజం వంటి అంశాల్లో ఈ బృందం దాదాపు ఏడాది పాటు కమాండో ట్రైనింగ్, 3 నెలల ప్రత్యేక స్వాట్ ట్రైనింగ్‌లో మొత్తం పదిహేను నెలలు కఠోర శిక్షణ పొందింది. పోలీసు, మిలటరీ భద్రతలో అత్యున్నతస్థాయి ప్రతిభ కనబరిచే ఇజ్రాయెల్ భద్రతాదళం మొదటిసారిగా ఉపయోగించిన ‘క్రావ్ మాగా’ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లోనూ (మార్షల్ ఆర్ట్స్) ఈ ధీరవనితలు చక్కటి తర్ఫీదు పొందారు. ఆయుధాలు లేకుండా కూడా ముష్కరులను ఎదుర్కోగలగడం, ఎంపీ–5 సబ్ మిషన్‌గన్స్, ఏకే–47, గ్లాక్–17, 26 పిస్టల్స్ వినియోగంలోనూ సుశిక్షితులయ్యారు. మానేసర్‌లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కేంద్రంలో, జారోడా కలాన్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోనూ తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కీలకం పట్టణప్రాంతాల్లో ఉగ్ర దాడులు ఎదుర్కోవడంతో పాటు, తీవ్రవాదులు ప్రజలను బందీలుగా తీసుకున్న సంక్షోభ పరిస్థితుల్లో ఈ మహిళలు మగవారికంటే ఏమాత్రం తక్కువ కాకుండా సమర్థవంతంగా వ్యవహరించగలరని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన ఆలోచనకు అనుగుణంగానే ఈ ప్రత్యేక మహిళా బృందం రూపుదిద్దుకోగలిగింది.‘మహిళలు ఇదే చేయగలరు. అది చేయలేరు అనే భావన కొందరిలో ఏర్పడింది. అయితే స్వాట్ మహిళలు పురుష కమాండోలతో సరిసమానంగా కొన్ని సందర్భాల్లో వారి కంటే మెరుగ్గా కూడా పనిచేయగలరని నేను గర్వంగా చెప్పగలను’ అని సీనియర్ అధికారి ప్రమోద్ కుషవాహ వ్యాఖ్యానించారు. అత్యుత్తమమైన వారిగా పరిగణ పొందుతున్న కొందరు పురుష కమాండోలు కూడా ఈ ధీరవనితలు చేసే కొన్ని సాహసకృత్యాలను చేయలేరని ఈ అధికారి అన్నారంటే ఈ టీమ్ ఎంత శక్తిమంతంగా ఉందో మనం అంచనా వేయొచ్చు. ‘స్వాట్’ ప్రత్యేకత ఏమిటి? దాడులు, ప్రతిదాడులు, జంగిల్ ఆపరేషన్‌తో పాటు మిగతా అంశాలన్నింట్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచిన కారణంగానే వీరు స్వాట్ బృందంలో సభ్యులు కాగలిగారు. ఎలాంటి తీవ్రమైన పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు వీలుగా వీరి కిట్లలో హ్యాండ్ గ్రెనేడ్లు, వైర్‌లెస్‌సెట్, 20 మీటర్ల నైలాన్‌తాడు, పెన్సిల్ టార్చి, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, శక్తివంతమైన టార్చి, కట్టర్, కమాండోలు ఉపయోగించే డాగర్, తదితర సామగ్రి ఉంటుంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన ‘కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ స్పెషలిస్ట్‌లు’ వీరికి శిక్షణనిచ్చిన వారిలో ఉన్నారు. ఈ టీమ్‌లో అస్సాం నుంచి అత్యధికంగా 13 మంది, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మణిపూర్‌ల నుంచి ఐదుగురేసి చొప్పున, మేఘాలయా నుంచి నలుగురు, నాగాలాంగ్ నుంచి ఇద్దరు, మిజోరం, త్రిపురల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. – కె. రాహుల్ -
తొలి మహిళా కమాండోల టీమ్
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి మావోయిస్టుల ఏరివేతకు మహిళా టీమ్‌లు రంగంలోకి దిగాయి. నక్సల్స్ ఏరివేతకు మహిళా ప్రత్యేక దళాలు అడవుల్లో మోహరించింది. దీంతో మహిళా కమాండోలు ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఈ టీమ్ పనిచేస్తుంది. ఇటీవలే రెండు మహిళా జట్టులను సహచర పురుషుల జట్టుతో పాటు మావోయిస్టులపై గస్తీ కోసం పంపారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్త్రా జిల్లాకు ఒక టీమ్ వెళ్లగా, మరో టీమ్ జార్ఖండ్ వెళ్లింది. వీరందరితో రెండు ప్లాటూన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాటూన్‌లో 35 మంది మహిళలు ఉంటారు. ఈ మహిళలతో అడవుల్లోని గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తారు. మావోయిస్టుల్లో చేరివేతలు లేకుండా నిర్మూలించడం, ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడం వీరి విధి. ఈ చర్యలు పశ్చిమబెంగాల్లో ఫలితాలను ఇచ్చాయి. సీఆర్పీఎఫ్ మావోయిస్టుల ఏరివేత కోసమే 90,000 మందిని సిద్ధం చేసింది. వీరు జార్ఖండ్, చత్తీస్‌గఢ్ అడవుల్లో ఏరివేత కొనసాగిస్తారు.