రోడ్డు రిఫ్లెక్టర్ల వెనుక పిల్లి కళ్ళు! | A cat eye road reflector | Sakshi
Sakshi News home page

రోడ్డు రిఫ్లెక్టర్ల వెనుక పిల్లి కళ్ళు!

May 28 2026 7:47 AM | Updated on May 28 2026 12:16 PM

A cat eye road reflector

చిన్నారులూ! రాత్రి వేళల్లో రోడ్డు మధ్యలో చిన్న చిన్న లైట్లు మిలమిలా మెరుస్తూ కనిపించడాన్ని ఎప్పుడైనా గమనించారా? వాటినే రోడ్డు రిఫ్లెక్టర్లు లేదా క్యాట్‌ ఐస్‌ అని పిలుస్తారు. ఇవి రహదారిపై రాబోయే మలుపులు, లేన్‌ సరిహద్దులు, రోడ్డు అంచులను స్పష్టంగా చూపిస్తాయి. ప్రమాదాలు జరగకుండా రక్షిస్తాయి.

 ఎవరు కనిపెట్టారో తెలుసా? 1933లో బ్రిటన్‌కు చెందిన పెర్సీషా అనే వ్యక్తి దట్టమైన పోగమంచులో తన కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. చీకటి ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు ఎటు ఉందో తెలియక కంగారు పడుతున్న సమయంలో, రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఒక పిల్లి అతని కారు వైపు చూసింది. కారు హెడ్‌లైట్ల వెలుతురు పడగానే ఆ పిల్లి కళ్ళు చీకట్లో వింతగా మెరిశాయి! ఆ మెరుపును చూసి పెర్సి షా అలర్ట్‌ అయ్యాడు. అక్కడ రోడ్డు మలుపు ఉందని గ్రహించి, కారును జాగ్రత్తగా పక్కకు తిప్పాడు. 

అలా ఆ పిల్లి కళ్ళ మెరుపు అతని ప్రాణాలను కా΄ాడింది. అపుడే పెర్సి షాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ‘పిల్లి కళ్ళు’ చీకట్లో వెలుతురును తిరిగి ప్రతిబింబిస్తాయి కదా! మరి రోడ్డుపై కూడా ఇలాంటివే ఏర్పాటు చేస్తే రాత్రిపూట డ్రైవర్లకు ఉపయోగపడతాయని ఆలోచించాడు. వెంటనే అతను ఒక కొత్త పరికరాన్ని తయారుచేసి దానికి ‘క్యాట్స్‌ ఐ’ అని పేరు పెట్టాడు. వాహనాల హెడ్‌లైట్‌ వెలుతురు దీనిపై పడగానే, అది తిరిగి వెలుగును వెనక్కి పంపుతుంది. కాలం మారుతున్న కొద్దీ ఈ రిఫ్లెక్టర్లు ఇంకా స్మార్ట్‌గా మారిపోయాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement