పల్లెల్లో బయోత్పాతం | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో బయోత్పాతం

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

ప్లాంట్‌తో ఊళ్లు నాశనం మా పొట్ట కొట్టొద్దు రాబోయే తరాలకూ ప్రమాదం

న్యూస్‌రీల్‌

పశుపోషణ విధ్వంసం

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే వ్యర్థాలు మా గ్రామంలోని వాగులోకి తరలిస్తున్నారని అంటున్నారు. దీంతో గ్రామస్తులు రోగాల బారిన పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పుకోం. ప్రభుత్వం మంత్రి కుటుంబసభ్యులకు ఇచ్చిన స్థలాన్ని వెంటనే రద్దు చేయాలి.

–వీర్ల సుజాత, చిన్న ఆగిరిపల్లి గొల్లగూడెం

మా పూర్వీకుల నుంచి పశుపోషణకు ఈ కొండ మీదే ఆధారపడే వాళ్లం. గొర్రెలు, మేకలను మేపుకుంటూ వాటి మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇక్కడ మంత్రి కుటుంబసభ్యులు బయో గ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తే మాకు జీవనాధారం లేకుండా పోతుంది. కంపెనీ ఏర్పాటుచేసి మా పొట్టలు కొట్టవద్దు.

– పుసునూరు సాంబశివరావు,

రైతు, చిన్న ఆగిరిపల్లి గొల్లగూడెం

ప్లాంట్‌ నుంచి వచ్చే విషవాయు వులతో చుట్టుపక్కల గ్రామాల్లో చిన్నారులు అనారోగ్యం పాలవుతారు. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పుకోం. బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు రద్దు చేసే వరకూ దీనికోసం చుట్టుపక్కల గ్రామాల వారితో కలిపి పోరాడతాం.

– దాసరి శరత్‌బాబు, రైతు, తోటపల్లి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: మంత్రి కొలుసు పార్థసారథి మంచి చేస్తాడని నమ్మాము.. ఓట్లు వేసి గెలిపిస్తే మా జీవనాధారానికి గండి కొట్టి కోట్లు గడించాలని చూస్తున్నారు.. వేల ఎకరాల భూముల విధ్వంసం, చెరువులు విషపూరితానికి కారణమవుతున్నారు.. అంటూ పల్లెలు గగ్గోలు పెడుతున్నాయి.. అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా మంత్రి మొండిగా ముందుకు వెళుతున్నారు.. ప్రభు త్వం ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో మంత్రి కు మారుడికి కేటాయించిన భూమిలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటును నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. నిర్మాణ పను లను అడ్డుకుని ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

రాష్ట్ర గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి నూజివీడు నియోజకవర్గంలో గ్రామస్తుల నుంచి తీవ్ర సెగ తగిలింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో తన కుమారుడితో పరిశ్రమ పెట్టించడానికి భూమి కోసం రకరకాల సెచ్క్‌లు గీశారు. కట్‌చేస్తే.. 250 ఏళ్లుగా తోటపల్లి, చిన్న ఆగిరిపల్లి, తోటపల్లి సమీపంలోని ఏడు గ్రామాలకు చెందిన చిన్న సన్నకారు రైతులు, గొల్లగూడెం, హరిజనగూడానికి చెందిన రైతులు పశువుల మేతకు వినియోగించే కొండను స్వాహా చేయడానికి తెరదీశారు. దీంతో ఆగిరిపల్లి మండలంలోని తోటపల్లి పరిధిలో సర్వే నం.2/1లో 45.60 ఎకరాల భూమిని మంత్రి కుమారుడికి చెందిన నితిన్‌ సాయికృష్ణ కన్‌స్ట్రక్షన్‌కు ప్రభుత్వం ఎకరా రూ.5 లక్షలకు కేటాయించింది. వాస్తవానికి ఆగిరిపల్లి మండలంలో ఎకరా భూమి సగటున రూ.40 లక్షల ధర ఉంటుంది. అయితే చాలా తక్కువ ధరకు కేటాయించారు. ఇటీవల ఇక్కడ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం కోసం భూమిలో లెవెలింగ్‌ పనులు మొదలుపెడితే భారీగా గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. తోటపల్లి, చిన్న ఆగిరిపల్లి, గొల్లగూడెం, శరణాలగూడెం, సింగన్నగూడెం గ్రామస్తులు ప్లాంటు ఏర్పాటు చేయొద్దంటూ కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నా మంత్రి మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

మంత్రి అనుచరుల మంతనాలు

ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు సర్దిచెప్పడానికి మంత్రి పార్థసారథి అనుచరగణం రంగంలోకి దిగింది. సోమవారం గ్రామస్తులు పనులను అడ్డుకోవడంతో మంగళవారం రాత్రి మంత్రి అనుచరులు రంగంలోకి దిగి మూడు గ్రామాలకు చెందిన కొందరు రైతులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అందరూ ససేమిరా అనడంతో వారు వెనుదిరిగారు.

అమాత్యా.. ఇది తగునా

బయోగ్యాస్‌ ప్లాంట్‌తో ధ్వంసం చేయొద్దు

మంత్రి కొలుసు ఇలాకాలో తిరుగుబాటు

తోటపల్లిలో 45.60 ఎకరాలు తనయుడికి కేటాయింపు

కంపెనీ పనులను అడ్డుకున్న గ్రామస్తులు

రాత్రిళ్లు మంత్రి అనుచరుల మంతనాలు

నాలుగు గ్రామాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు మేకలు, గొర్రెలు, గేదెలను మేపుకోవడానికి దాదాపు 250 ఏళ్ల నుంచి ఈ కొండను వినియోగించుకుంటున్నారు. గతంలోనూ గ్రావెల్‌ తవ్వకాల కోసం ఇదే తరహాలో అక్రమ కే టాయింపులకు ప్రయత్నాలు జరిగితే గ్రామస్తులంతా ఇంటికి రూ.వెయ్యి చందా వేసుకుని మరీ హైకోర్టును ఆశ్రయించారు. పశువుల మేతకు తప్ప వేరే అవసరాలకు వినియోగించకూడదని స్టే ఆర్డర్‌ ఇచ్చింది. దాదాపు వేల సంఖ్యలో పశువులకు ఇదే ఆధారం. దీనిని ధ్వంసం చేసి బయోగ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే విషవాయువులు, వ్యర్థాలకు భూగర్భ జలాలతో పాటు సమీపంలోని పెద్ద రావిచెరువు, కొత్తచెరువుల్లో నీరు విషమవుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ ప్రభావం సమీపంలోని 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది. ఈ గ్రామాలన్నీ రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. దీంతో పాటు తోటపల్లి, చిన్న ఆగిరిపల్లిలో మామిడి, మొక్కజొన్న ఇతర పంటలు వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. అక్కడి రైతులూ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ కొండను కంపెనీ ముసుగులో దండుకోవడానికి మంత్రి కొలుసు చూ స్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామస్తులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement