బాలింత మృతదేహానికి పోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

బాలింత మృతదేహానికి పోస్టుమార్టం

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

బాలింత మృతదేహానికి పోస్టుమార్టం చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తణుకు అర్బన్‌: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న బాలింత మృతదేహానికి బుధవారం పోలీసుల పంచనామా అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మునిసిపల్‌ కార్మికులచే ఖననం చేయించారు. ఈనెల 16వ తేదీన స్టార్‌ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చి బాలింత మృత్యువాత పడిన విషయం అందిరికీ తెలిసిందే. ఆమె బీహార్‌కు చెందిన కుమారిగా గుర్తించడం మినహా ఆమెకు సంబంధించిన ఆధారాలు ఇంతవరకు సేకరించలేకపోయారు. ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం తీసుకువచ్చిన ఆర్‌ఎంపీ వైద్యుడు చంటి, అతని స్నేహితుడు రాజమండ్రికి చెందిన మోషే, మరొక మహిళ ఈ వ్యవహారంలో ఉన్నప్పటికీ ఘటన తరువాత మోషే, మహిళ పరారవ్వడం, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలించడం తప్ప మరేమీ పురోగతి లేదు. ఈ వ్యవహారపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఉంగుటూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం కుచెందిన తాటిపర్తి కాంతారవు (49) ఈనెల 13న ఏలూరు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా నారాయణపురంలోని పెట్రోలు బంకు సమీపంలో అదుపు తప్పి డివైడరుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో డివైడరుపై ఉన్న చెట్టు మెద్దు ఒకటి అతడి కంటికి గుచ్చుకుంది. హైవే అంబులెన్సు వారు తొలుత తాడేపల్లిగూడెం, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహ్‌చ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కాంతారావు సోమవారం రాత్రి మృతి చెందాడు. కాంతారావు భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్య భగవాన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement