ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

ప్రశాంతంగా నీట్‌ రాట్నాలమ్మా.. నమోనమః మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు మాల మహానాడు నాయకుల అరెస్ట్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నీట్‌ యూజీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,680 మంది అభ్యర్థులకు 1,619 మంది హాజరయ్యారు. గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయంలో 360 మందికి 344 మంది, సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో 312 మందికి 299 మంది, కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో 288 మందికి 276 మంది, కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 288 మందికి 283 మంది, కోటదిబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 192 మందికి 185 మంది, గాంధీనగర్‌ నగరపాలక ఉన్నత పాఠశాలలో 240 మందికి 232 మంది హాజరయ్యారు.

దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయంలో ఆదివారం విశేష పూ జలు జరిగాయి. అధి క సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నల్లూరి సతీష్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏలూరు (టూటౌన్‌): మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5న తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ ఆదివారం ప్రకటనలో పిలుపునిచ్చారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా వ్యాపారులు దయాదాక్షిణ్యాలకు వదిలివేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులు రూ.1,400 నుంచి రూ.1,700కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సంప్రదించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరిచి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని అన్నారు.

ద్వారకాతిరుమల: బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడగా.. ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన ఎం. నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్‌ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని లైన్‌ గోపాలపురానికి చెందిన గురపర్తి రమాదేవి, వడ్లమూడి గోపమ్మ, రాజులపాటి గంగమ్మ, మల్లుల ప్రసన్న, టి.వెంకటలక్ష్మి, యార్లగడ్డ మహాలక్ష్మి ద్వారకానగర్‌లో ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ఆటో అదుపుతప్పింది. స్థానికులు క్షతగాత్రులను భీమడోలు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భీమవరం: ఆకివీడులో దళితులపై అక్రమ కేసు లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులకు అండగా నిలవడానికి వెళుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ను భీమవరంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పుష్ప రాజ్‌ మాట్లాడుతూ కులమతాలను రెచ్చగొట్టేలా డిప్యూటీ స్పీకర్‌, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చేస్తున్న అరాచకాలను తక్షణం ఆపాలన్నారు. రఘురామ వ్యవహారంపై ప్రభుత్వం కలుగజేసుకుని చట్టం అందరికీ ఒకేలా వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement