కొనసాగిన మట్టి పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన మట్టి పరీక్షలు

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

కొనసాగిన మట్టి పరీక్షలు ఉమ్మడి పశ్చిమలో న్యాయమూర్తుల బదిలీలు దళిత ఎంపీకి అవమానం దారుణం జనగణనకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి సమాచారంతో పత్రాలు తప్పనిసరి

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) బృందం బుధవారం కూడా పరీక్షలు నిర్వహించింది. మట్టి, రాతి నాణ్యతా నిపుణులు అన్వేష్‌, గౌరవ్‌ పాండే, ఉదయ్‌ చక్రవర్తి, హరీందర్‌ సింగ్‌ప్రకాష్‌ జలవనరుల శాఖ, ఎంఈఐఎల్‌ ప్రతినిధులతో కలిసి కొత్తూరు చెరువులో 28 నమూనాలు సేకరించారు. ఈ నమూనాలకు ఢిల్లీ కేంద్ర కార్యాలయ పరిశోధనా కేంద్రంలో మరిన్ని పరీక్షలు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఈసీఆర్‌ఎఫ్‌తో పాటు పలు కీలక నిర్మాణాల్లో రాళ్లు, మట్టిని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. జలవనరులశాఖ ఈఈ డి.శ్రీనివాస్‌, ఎంఈఐఎల్‌ జీఎం గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్య శాస్త్రవేత్తలకు తాము అంతర్గతంగా చేస్తున్న పరీక్షల వివరాలు, తమ ల్యాబ్‌లో ఉన్న పరికరాలను చూపించి వివరించారు. గ్యాప్‌ 1, 2లో మట్టి, రాళ్ల నాణ్యతను బృందం రింగ్‌ టెస్ట్‌ ద్వారా పరిశీలించింది.

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పలువురు జడ్జీలు బదిలీ అ య్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్ర సాద్‌ రాజమహేంద్రవరం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజమహేంద్రవరంలో పనిచేస్తున్న డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి రానున్నారు. ఏలూరులో ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌)గా పనిచేస్తున్న కేకేవీ బులికృష్ణ ప్రకాశం జిల్లా కందుకూరు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పనిచేస్తున్న ఎం.ప్రమీలారాణి బదిలీపై రానున్నారు.

దెందులూరు: దళిత ఎంపీ గొల్ల బాబూరావును అవమానించి దళితులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న విధానాన్ని తేటతెల్లం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కొవ్వలిలోని ఆయన కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవానికి రాజ్యసభ స భ్యుడు గొల్ల బాబూరావును ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించకపోవడం నిర్వాహకులు, ప్రభుత్వ పెద్దల అహంకారానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. వేదికపై రాజ్యసభ సభ్యుడి ప్రొటోకాల్‌ ఏమిటో వైస్‌ చాన్సలర్‌, సంబంధిత అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. దళిత ప్రజాప్రతినిధి అయితే ఒక గౌరవం.. వేరే సామాజికవర్గం ప్రజాప్రతినిధులు అయితే గౌ రవం వేరేగా ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికారులు అధికారం ఉంది కదా అని ప్రభుత్వం చెప్పినట్టు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దీనిపై భవిష్యత్‌ కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో వచ్చేనెల 1 నుంచి జరిగే ఇంటింటి జనగణన నమోదుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.వెట్టిరసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈనెల 16 నుంచి 30 వరకు జిల్లాలో స్వీయగణన కా ర్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారన్నారు. మే 1 నుంచి 30 వరకు ఇంటింటా గణనకి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించామన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి, సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల కోసం పరిశ్రమలు సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు కావాల్సిన పత్రా లు సమర్పించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏలూరు ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్‌ ఏఎస్‌ఆర్‌సీ మూర్తి ప్రకటనలో తెలిపారు. వీటిని సమర్పిస్తే సీటీఈ (స్థాపన) అనుమతి, సీటీఓ రెన్యూవల్‌ (ఆపరేషన్‌ అనుమతి)కి వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలోని హెల్ప్‌డెస్క్‌ సేవలను వినియోగించుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement