శ్రీవారికి నృత్య నీరాజనం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి నృత్య నీరాజనం

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

శ్రీవారికి నృత్య నీరాజనం

ద్వారకాతిరుమల: మయూరాలు పురివిప్పి నర్తించినట్టు.. ఆ కళాకారుల నాట్య హేలాను కన్నులారా వీక్షించిన నృత్యాభిమానులు ఆనందంతో పులకించిపోయారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కామాక్షి నృత్యాలయం (మైలవరం), శ్రీ పాద వల్లభ కూచిపూడి నాట్య నిలయం (ఏలూరు), డీజీ సరస్వతి (విజయవాడ), శ్రీ జననీ నృత్య నికేతన్‌ (కాకినాడ) వారు మంగళవారం శ్రీహరి కళాతోరణ వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న నృత్య రీతులను ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

కూచిపూడి నృత్య ప్రదర్శన

విభిన్న భంగిమల్లో చిన్నారులు

Advertisement
 
Advertisement
Advertisement