అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి హుండీ ఆదాయం లెక్కింపు అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు

ఏలూరు (టూటౌన్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సూచించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లలో 203 అర్జీలను స్వీకరించారు. అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని, పరిష్కార ప్రక్రియలో పారదర్శకత ఉండాలని అన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, ట్రైనీ ఐఏఎస్‌ చింతకింది శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎల్‌.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.

సాధారణ పరిస్థితికి చర్యలు

జిల్లాలో డీజిల్‌ సమస్యకు మంగళవారం ఉదయం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం 600 కిలోలీటర్ల వరకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజిల్‌ సమస్యలు తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో 7569296272 నంబర్‌తో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో రబీ ధాన్యం రవాణా, ఆక్వా రైతులకు, అత్యవసర వైద్య వాహనాలకు 12 వేల లీటర్ల డీజిల్‌ అందించామన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ అవసరానికి మించి డీజిల్‌ కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటే ప్రస్తుత వేసవి దష్ట్యా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శాఖా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జుత్తుగ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. శిబిరాల్లో పుస్తక పఠనం, కథారచన, పద్యరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, కార్టూన్‌ రూపకల్పన, హస్తకళలు, క్విజ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు తదితర అంశాలు చేర్చామన్నారు. అలాగే ప్రాథమిక కంప్యూటర్‌ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక కార్యాచర ణ ప్రణాళికలను రూపొందించి పిల్లలు, యు వత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ద్వారకాతిరుమల: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాళ్లకుంటకి చెందిన గజ్జరపు రంగారావు (60) ఈనెల 25న ఉదయం తన బైక్‌పై శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమల వస్తున్నారు. రాళ్లకుంటలోని సెయింట్‌ గ్జేవియర్‌ పాఠశాల వద్దకు వచ్చేసరికి బీపీ పెరిగి బైక్‌పై నుంచి పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలు కాగా రాజమండ్రిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మృతుడి కుమారుడు రాము ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు హెడ్‌ కానిస్టేబుల్‌ జి.దుర్గారావు తెలిపారు.

దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మవారి ఆలయంలో హుండీల ఆ దాయాన్ని సోమవారం లెక్కించారు. దేవదా య శాఖ ఏలూరు డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌బాబు ఆధ్వర్యంలో లెక్కించగా 33 రోజులకు రూ.8,72,346 సమకూరింది. ఆలయ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పెనుగొండ : అయోధ్యలంక రావిలంకలో మట్టి, ఇసుక దందాపై వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా మట్టి, ఇసుక రాత్రి వేళ్లల్లో తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వి మర్శించారు. ఆచంట నియోజకవర్గంలోని ఇ సుక ర్యాంపులన్నీ సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్నా తవ్వకాలను అడ్డుకోకపోవడం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement