ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు వెన్నుపూస రవీంద్రరెడ్డి పిలుపు మేరకు జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు పుప్పాల గోపి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, కూలీల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. జిల్లాలో ఉపాధి శ్రామికుల వేతనాల బకాయిలు మంజూరు చేయించాలని కోరారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కోటగిరి రాజా నాయన, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శి మల్నీడి బాబి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నిట్ట గంగరాజు, దెందులూరు జెడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి ఏసు రాజు, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ద్వంతంశెట్టి సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు శ్యామ్‌బాబు, చింతలపూడి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు చండీ ప్రియారెడ్డి, సర్పంచ్ పుచ్చకాయల విష్ణు, తమ్మినేని శ్రీనివాసరావు, గౌతు రాము, మిద్దె వెంకటేశ్వరరావు, ఎలిశెట్టి బాబి, గాది రమణ, శ్రీనివాసరావు, ఎంపీటీసీలు పంతుల వెంకన్న బాబు, బండారు నాగరాజు, ఉంగుటూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు.


