డీఏ బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

డీఏ బకాయిలు విడుదల చేయాలి

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

డీఏ బకాయిలు విడుదల చేయాలి

పాలకొల్లు సెంట్రల్‌: ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను విడుదల చేయాలని మహి ళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భవనంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాంత్‌రాజు మాట్లాడుతూ పీఆర్‌సీని ఏర్పాటుచేసి మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. జోనల్‌ వ్యవస్థ ఏర్పాటులో సంఘంతో అధికారుల సమన్వయ స మావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశా రు. యాప్‌ల భారం తగ్గించి ఉదయం, సా యంత్రం సమయాల్లో జూమ్‌ సమావేశాలు ర ద్దు చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేయాలని కోరారు. డీసీపీఓ, ఐసీపీఎస్‌, డీఈఓ, బీపీసీలకు బదిలీలు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస టైం స్కేల్‌ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌ కుమారి, జిల్లా అధ్యక్షుడు జెట్టి సత్యనారాయణ

Advertisement
 
Advertisement
Advertisement