ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 7వ తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు ప్రోగ్రాం కన్వీనర్‌గా టీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ పార్థసారథికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ 2024, 2025 సంవత్సరాల్లో 48 గంటల పాటు తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు నిర్వహించిన అనుభవం ఉన్నందున తనను మళ్లీ ప్రోగ్రాం కన్వీనర్‌గా నియమించారని తెలిపారు. తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనింపచేయాలనే మహత్తర సంకల్పంతో జూన్ 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 7వ తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


