భీమవరం: ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఈనెల 23న జరిగిన ఎంపిక పోటీల్లో తమ విద్యార్థులు ఎన్ శ్రీమాన్‌సాత్విక్, డి లీలాప్రవీణ్‌నాయక్, డి సత్యదేవిశ్రీసంతోష్ ప్రతిభ కనబరిచి జిల్లా టీమ్‌కు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రిన్సిపాల్ ఎం.వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీలక్ష్మి, పీడీ శ్రీనివాసరావు అభినందించారు.


