షార్ట్‌ సర్క్యూట్‌తో లారీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో లారీ దగ్ధం

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో లారీ దగ్ధం ప్రశాంతంగా గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష

ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డు పుట్లగట్లగూడెం సమీపంలోని లారీ ఇంజిన్‌లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. 8లో u

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో వివిధ తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం జరిగే ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నగరంలోని 6 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు జరిగిన పరీక్షకు 901 మందికి 714 మంది హాజరయ్యారు. గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌జేసీ పరీక్షకు 1604 మందికి 1440 మంది హాజరు కాగా 164 మంది గైర్హాజరయ్యారు. గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌జేసీ సెట్‌ పరీక్షకు 26 మందికి 23 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement