తాడేపల్లిగూడెంలో సినీ హీరో అడవి శేష్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో సినీ హీరో అడవి శేష్‌ సందడి

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

తాడేపల్లిగూడెంలో సినీ హీరో అడవి శేష్‌ సందడి నేటి నుంచి కాళ్లకూరు వెంకన్న కల్యాణోత్సవాలు బయో ఫెర్టిలైజర్లతో మేలు రేపు ఐఐటీ, నీట్‌పై ‘శశి’ అవగాహన సదస్సులు

తాడేపల్లిగూడెం: సినీ హీరో అడవి శేష్‌ శుక్రవారం పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కంప్లెక్స్‌లో డెకాయిట్‌ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసిన అనంతరం మాట్లాడారు. మరో మూడు చిత్రాలలో నటిస్తున్నానని, గూఢచారి–2 మేకింగ్‌లో ఉందన్నారు. ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. థియేటర్‌ నిర్వాహకులు గన్నమనేని శ్రీనివాసరావు, చలంచర్ల హరి, సౌమ్య, ఆడిటర్‌ ఎన్‌వీ రమణరావు, డాక్టర్‌ సందీప్‌ ఉన్నారు.

కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి ప్రారంభించే ఈ ఉత్సవాలు మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్‌ అడ్డాల శివరామరాజు, ఈఓఅరుణ్‌ కుమార్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం, వెలుపల ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లాత్‌ డెకరేషన్‌ భక్తులను ఆకర్షిస్తుంది. 27న కల్యాణం, మే 1న స్వామి వారి రథోత్సవం, 9న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తారు.

తాడేపల్లిగూడెం: బయో ఫెర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఐసీఏఆర్‌ , అటారీ జోన్‌ పది ఆధ్వర్యంలో శుక్రవారం వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో ఖరీఫ్‌ 2026 పంటలలో సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పచ్చి రొట్టల పంటల ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరిగి పంట ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. వెంకట్రామన్నగూడెం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన రచ్చబండలో రైతుల సమస్యలకు సమాధానలిచ్చారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): ఇంజనీరింగ్‌, వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 26న (ఆదివారం) 6, 7, 8, 9, 10, 10+1 విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ విద్యపై విశాఖపట్నం సంగివలసలోను, తాడేపల్లిగూడెం కడకట్ల క్యాంపస్‌లోను అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని శశి విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. నిష్ణాతులైన సీనియర్‌ అధ్యాపక బృందం సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. సదస్సులకు వచ్చేవారు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శశిస్కూల్‌.కామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సదస్సులు నిర్వహిస్తామని, భోజన వసతి కల్పిస్తామని శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మేకా కాంత్రి సుధ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement