పోలీసు స్టేషన్‌ ఎదుట ఏటీఎం చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

పోలీసు స్టేషన్‌ ఎదుట ఏటీఎం చోరీకి యత్నం

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

కై కలూరు: సర్కిల్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం జరగడం కై కలూరులో శుక్రవారం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని వచ్చి ఏటీఎం కార్డ్‌ రీడర్‌, డయల్‌ ప్యాడ్‌ను పగలుగొట్టాడు. నైట్‌ వాచ్‌మెన్‌ అప్పటి వరకు విధులు నిర్వహించి సమీపంలో నిద్రకు ఉపక్రమించడంతో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం ఏటీఎంను శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్‌ గమనించి మేనేజర్‌కు చెప్పడంతో విషయం బయటపడింది. ఈ ఘటనపై ఎస్సై డి.వెంకట్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఏలూరు క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇదిలా ఉంటే నిందితుడు ఏటీఎం కార్డు మిషన్‌లో ఇరుక్కుపోవడంతో డయల్‌ ప్యాడ్‌ను పగలుగొట్టి కార్డు తీసుకువెళ్లాడా? అనే అనుమానాలు కలుగుతుంది. ముఖానికి ఎటువంటి మాస్క్‌ కట్టుకోలేదని, మెషీన్‌ మిషన్‌ను ఊడదీయడానికి ఎటువంటి పరికరాలు ఉపయోగించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఆచుకీ తెలిస్తే 94407 96434, 94407 96433 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement