ట్రాక్టరు బోల్తా.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టరు బోల్తా.. ఒకరి మృతి

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

ట్రాక్టరు బోల్తా.. ఒకరి మృతి జిల్లా ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

గణపవరం: మండలంలోని కోమర్రు గ్రామ పరిధిలో ఓ ట్రాక్టరు పంట కాలువలో తిరగబడింది. ఈ ప్రమాదంలో వట్టిప్రోలు జగదీశ్‌ (43) అనే కౌలురైతు అక్కడికక్కడే మరణించాడు. జగదీష్‌ సాగుచేసిన తన పొలంలో వరికోత యంత్రంతో కోతకోయించి ధాన్యాన్ని ట్రాక్టర్‌మీద సమీప పుంతగట్టుకు చేరవేయించాడు. అనంతరం ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పంట కాలువలోకి తిరగబడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో కూర్చున్న రైతు జగదీశ్‌పై ట్రక్కు పడడంతో కింద ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఎస్సై మణికుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు రూరల్‌: శాప్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకూ అనంతపురంలో రాష్ట్రస్థాయి పుట్‌బాల్‌ పోటీలు జరుగుతాయని ఏలూరు జిల్లా డిఎస్‌డీఓ ఎస్‌ఏ చెప్పారు. శుక్రవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అండర్‌–15, అండర్‌–21 బాలబాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌ –15 బాలికల విభాగంలో ఎస్‌.సౌమ్య, సీహెచ్‌ బ్లెస్సీ, ఎ.మౌనిక, వి.లిషిత, టి.సుభశ్రీ, ఎం.చైత్రవల్లి, పి.చందు, సీహెచ్‌ హిమవర్షిణి, డి.రిషితసాయి, డి.చరణ్య్‌, ఎ.చంద్రిక, ఎస్‌.తేజశ్రీ, ఎం.సహస్త్ర, కె.కార్తిక, పి.గాయత్రి ఉన్నారు. బాలుర విభాగంలో ఎన్‌.రావణఉదయ్‌, ఎ.అఖిల్‌వర్మ, ఎన్‌.తేజస్‌వినయ్‌, ఎస్‌.మణ్య, జె.రామ్‌, వేవన్‌, తవన్‌, భువన్‌, కిన్నీ ఎలిజా, రిషేంద్ర, అమ్నాజ్‌, గంగాధర్‌, రిషబ్‌, ముస్తఫా, ప్రణీత్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement