ఏలూరులో వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో పాలకులకు ప్రజలకు మేలు చేయటం చేతకాదనీ.. కనీసం మంచిచేసే వారినైనా ప్రోత్సహించేలా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని 45వ డివిజన్ ఆదివారపుపేట మార్కెట్ ప్రాంతంలో పార్టీ యువజన నేత పసుపులేటి దినేష్ ఇటీవల చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గురువారం వేకువజామున రాజకీయ కక్షలతో కొందరు ఈ చలివేంద్రాన్ని తొలగించారు. దీనిపై పార్టీ శ్రేణులు మండిపడ్డారు. పాతబస్టాండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్ ప్రాంతంలో నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో శాంతియుత నిరసన, ధర్నా చేపట్టారు. నగర పాలకులు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పా ల్పడటం సిగ్గుచేటని ఆయన అన్నారు. చలివేంద్రా న్ని తొలగించడాన్ని ప్రజలు హర్షించరని గుర్తుచేశా రు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేందుకు అందరూ ముందుకు రావాలని, రాజకీయ కక్షలతో ప్రజలకు ఉపయోగపడే చలివేంద్రాన్ని చెప్పకుండా తొలగించటం సరైన విధానం కాదన్నారు. నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ ఏలూరులో కూటమి నేతలు వైఎస్సా ర్‌సీపీ అంటే భయపడుతున్నారనీ, అందుకే చలివేంద్రం పెట్టినా తట్టుకోలేకపోయారని విమర్శించారు. బెల్టు షాపులకు అనుమతులు ఇస్తారు కానీ.. చలివేంద్రానికి అనుమతులు లేవా అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా ప్రధాన కా ర్యదర్శి లంకపల్లి గణేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి ము న్నుల జాన్‌గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, జిల్లా కార్యదర్శులు కంచుమర్తి తులసీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గాజుల బాజీ, జిల్లా కార్యదర్శి సాసుపల్లి యుగంధర్, ఆర్‌టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్, వైఎస్సార్‌టీయూ నగర అధ్యక్షులు గంటా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టూటౌన్ పోలీసులకు వినతిపత్రం అందజేసి, చలివేంద్రం తొలగింపుపై విచారణ చేయాలని కోరారు.


