ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నాటుసారా, ఎస్‌డీపీఎల్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్, కల్తీ కల్లు వంటివాటిపై పటిష్టమైన నిఘాతో నిరంతర తనికీలతో నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ ఎకై ్సజ్, ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ఎకై ్సజ్ శాఖ అధికారులతో ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ బి.శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లోనూ ప్రతీ లిక్కర్ బాటిల్ విధిగా ఏపీ సురక్ష యాప్‌తో స్కాన్ చేశాక మాత్రమే మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలోని అజయ్ వైన్స్‌లో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలతతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష యాప్‌లో మద్యం బాటిళ్ళను స్కాన్ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఏలూరు జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎ.అవులయ్య, పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


