న్యూస్‌రీల్
ఏలూరు నగరంలో ఆట స్థలాలు కరువయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో ఆడేందుకు ఆట స్థలాలు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 8లో u
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్. కొల్లేరు నుంచి మొదలై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాల మీదుగా 67 కి.మీ ప్రయాణించి కృష్ణా జిల్లా గొల్లపాలెంవద్ద కడలిలో కలుస్తుంది. కొల్లేరుకు అవుట్‌లెట్‌గా ఉన్న ఉప్పుటేరులో రెండు జిల్లాల్లోని 120 వరకు బుడమేరు, రామలేరు, తమ్మిలేరు, యనమదుర్రు, బొండాడ తదితర మేజర్, మైనర్ డ్రెయిన్లు, పంట కాలువలు కలుస్తుంటాయి. వీటిద్వారా గుర్రపుడెక్క, కిక్కిస ఉప్పుటేరులోకి చేరుతోంది. ఏళ్ల తరబడి ప్రక్షాళనకు నోచుకోక ఎక్కడికక్కడ డ్రెయిన్ పూడికతో మేటలు వేసింది.
ఆక్రమణల చెరలో..
డ్రెయిన్ వెంబడి 70 వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి, దొంగపిండి, మాలవానితిప్ప, కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం, లక్ష్మీపురం, మాట్లం తదితర పలుచోట్ల పీడబ్ల్యూడీ (డ్రెయిన్ మార్జిన్) భూమి వంద మీటర్ల నుంచి 500 మీటర్లకు వరకు ఉంటుంది. సారవంతమైన భూమి కావడంతో చాలా చోట్ల డ్రెయిన్ మార్జిన్‌ను ఆక్రమించి ఆక్వా చెరువులుగా మార్చేశారు. కూటమి హయాంలో చెరువుల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వారం రోజుల క్రితం లోసరి వద్ద ఉప్పుటేరు మార్జిన్ ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. కొల్లేరు నుంచి గొల్లపాలెం వరకు డ్రెయిన్ మార్జిన్ ఎంతమేర ఆక్రమణలకు గురైంది అధికారుల వద్ద వివరాలు లేకపోవడం ఉప్పుటేరు దుస్థితికి అద్దం పడుతుంది.
వానా కాలంలో ముప్పు
ఆక్రమణలు, పూడికలతో ఉప్పుటేరు సామర్థ్యం నానాటికీ తగ్గుతోంది. మూడు నుంచి ఆరు మీటర్లు వరకు ఉండాల్సిన డ్రెయిన్ లోతు కొన్నిచోట్ల మీటరు మాత్రమే ఉంది. గతంలో 25 వేల క్యూసెక్కుల సామర్థ్యం కాగా ఎనిమిది క్యూసెక్కులకు తగ్గిపోయింది. అధిక వర్షాలు, వరదల సమయంలో ముంపు ముప్పు వెంటాడుతోంది. ఏటా రెండు జిల్లాల్లోని పరివాహక గ్రామాలు, చెరువులు, పంటపొలాలు ముంపు బారిన పడి అపారనష్టం వాటిల్లుతోంది.
తండ్రీకొడుకుల చొరవ
కొల్లేరు సరస్సు ప్రక్షాళన సమయంలో ఉప్పుటేరు అభివృద్ధికి దివంగత వైఎస్సార్ చర్యలు చేపట్టారు. పూడిక తొలగింపు కోసం ఆకివీడు వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. జువ్వ కనుమ నుంచి ఆర్‌అండ్‌బీ వంతెన సమీపం వరకు కొంతమేర పనులు పూర్తిచేయగా తర్వాత వాతావరణం అనుకూలించక అప్పట్లో పనులు వాయిదా పడటంతో తర్వాత పట్టించుకునే వారు కరువయ్యారు.
2019–24 మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం స్వచ్ఛ కొల్లేరులో భాగంగా ఉప్పుటేరు ముంపు బెడద పరిష్కారానికి నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపారు. ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడతడిక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.412 కోట్ల కేటాయింపులు చేసి టెండర్ల ప్రక్రియను చేపట్టారు.
ముప్పుటేరు
పూడికతో నిండిన ఉప్పుటేరు
ఉప్పుటేరు మార్జిన్ ఆక్రమించి ఆక్వా చెరువులు తవ్వుతున్న దృశ్యం
కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్‌గా ఉన్న ఉప్పుటేరుపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. రూ.525 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు డ్రెయినేజీ శాఖ పంపిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను అటకెక్కించింది. ఆక్రమణలు, పూడికతో డ్రెయిన్ కుచించుకుపోగా ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు ఉప్పుటేరు ముంపు బెడదకు ఈ ఏడాది మోక్షం కలిగేలా లేదు.
కొల్లేరు ప్రధాన అవుట్‌లెట్‌గా ఉప్పుటేరు
ఆక్రమణలు, పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకం
25 వేల నుంచి 8 వేల క్యూసెక్కులకు పడిపోయిన సామర్థ్యం
డ్రెడ్జింగ్ కోసం రూ.525 కోట్లతో డీపీఆర్
ఏడాదవుతున్నా అతీగతీ లేని వైనం


