పాత సంచులు సరఫరా చేయడంతో వాటి నిండా చిల్లులే ఉంటున్నాయి. ఒక్కో సంచిలో 45 కేజీల ధాన్యం నింపాల్సి ఉండగా, కేవలం 35 నుంచి 40 కేజీలే పడుతున్నాయి. సంచుల తేడాతో రైతులు తీవ్ర నష్టానికి గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే నాణ్యమైన సంచులను సరఫరా చేయాలి.
– గంధం మధుసూధనరావు, రైతు, మాదివాడ, ఆకివీడు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాత సంచులు ఇస్తున్నారు. అవి సకాలంలో అందడం లేదు. రైతులు సంచుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాళ్వా కోతలు ముమ్మరంగా సాగుతున్నందున సంచుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– తుంపుళ్ల సూర్యనారాయణ, రైతు, ఆకివీడు


