పారా క్రీడాకారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

పారా క్రీడాకారుల ప్రతిభ

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

పారా క్రీడాకారుల ప్రతిభ రేపు కై కలూరులో జాబ్‌మేళా ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కై కలూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 24వ తేదీన జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్‌.జితేంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 775 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. పదవ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్‌ వంటి విద్యార్హతలు ఉండి 18–35 సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులని తెలిపారు. వివరాలకు 97013 57315, 62811 19575 (9988853335 – టోల్‌ ఫ్రీ) నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు అత్తిలి: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ బి శ్రీనివాస్‌ చెప్పారు. అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్‌ పూర్తిచేసి ఇంటివద్దనే ఉంటుంది. ఈనెల 20న రాత్రి ఇంటి వరండాలో ఆమె నిద్రిస్తున్న సమయంలో కునుపూడి పవన్‌సాయి అనే యువకుడు ఆమె చేయి పట్టుకున్నాడని, దీంతో బాధితురాలు కేకలు వేయగా గోడదూకి పారిపోతున్న నిందితుడిని ఆమె పెదనాన్ని వచ్చి పట్టుకున్నాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ చెప్పారు. తాడేపల్లిగూడెం రూరల్‌: నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు దిలీప్‌కుమార్‌ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగుడి అదృశ్యంపై ఆందోళన తణుకు అర్బన్‌: తణుకు మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాసరి శాంతారావు ఈనెల 5వ తేదీ నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తణుకు గోస్తనీ కాలువ కట్టేయడంతో నీటి ప్రవాహం తగ్గడం వలన బుధవారం వెంకట్రాయపురం ఆంధ్రా సుగర్స్‌ ప్రాంతంలో శాంతారావు వినియోగించే మూడు చక్రాల బ్యాటరీ వాహనం కాలువలో తేలడంతో సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ వాహనం శాంతారావుదేనని కుటుంబసభ్యులు గుర్తించడంతో ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయారా లేదంటే మరేదైనా జరిగిందా అనే కోణంలో తణుకు రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరభద్రపురంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న శాంతారావు తణుకు సూర్యాలయం వీధిలో సైకిల్‌ షాపులో పనిచేస్తూ రాత్రి సమయంలో ఇంటికి చేరుకుంటారని పోలీసులు చెబుతున్నారు.

అత్తిలి: అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అత్తిలికి చెందిన పారా క్రీడాకారుడు యడ్లపల్లి సూర్యనారాయణ ప్రతిభ కనబరిచాడు. థాయ్‌లాండ్‌లోని శ్రీరాచా పట్టణంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌ షిప్స్‌–2026లో అథ్లెటిక్స్‌ విభాగంలో శారీరక వికలాంగుల కేటగిరీ షాట్‌పుట్‌లో బంగారు పతకం, జావెలిన్‌ త్రోలో కాంస్య పతకం సాధించారు.

పాలకొల్లు సెంట్రల్‌: థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2026 పోటీల్లో పాలకొల్లు పట్టణానికి చెందిన ఎం నళిని రాజశేఖర్‌ ప్రతిభను చాటారు. వీల్‌చైర్‌ కేటగిరి పారా పికిల్‌బాల్‌ డబుల్స్‌లో నళిని రాజశేకర్‌ కోన ఏసుబాబుతో కలిసి కాంస్య పతకం సాధించారు. అథ్లెటిక్స్‌ విభాగంలో షాట్‌పుట్‌లో స్వర్ణ పతకం, జావెలిన్‌ త్రోలో కాంస్య పతకం సాధించాడు.

రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి

కాలువలో లభ్యమైన మూడు చక్రాల వాహనం

Advertisement
 
Advertisement
Advertisement