అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టే లేదు | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టే లేదు

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టే లేదు పెనుగొండ: సీఆర్‌జడ్‌ పరిధిలో తవ్వకాలకు నిషేధం ఉన్నా అధికార పార్టీ నేతలు ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపించారు. అయోధ్య లంక పరిధిలోని రావి లంకలో అక్రమంగా జరుగుతున్న మట్టి, ఇసుక దందా ప్రదేశాలను బుధవారం పరిశీలించారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా భూ బకాసురులు తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. రావిలంకలో తవ్వకాల్లో ఇళ్లు గోదావరిలో కలసి పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటలు దాటితే చాలు అక్రమ రవాణాను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఆర్డీవో, తహాసీల్దారు, పోలీసులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ తవ్వకాలను నిరోధించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులతో కలసి డిమాండ్‌ చేశారు. నిరసనలో ఆచంట మండల వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు. లైంగిక దాడికి యత్నంపై ఫిర్యాదు డీ మార్ట్‌లో స్వీపర్‌ చోరీపై కేసు భీమవరం: పట్టణంలోని డీమార్ట్‌లో స్పీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చెత్తను బయటకు తీసుకువెళ్లే సమయంలో సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులను ఆమె దొంగిలించినట్లు తేలడంతో మేనేజర్‌ నరేష్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్సై రహమాన్‌ చెప్పారు.

ముదినేపల్లి (కై కలూరు): లైంగిక దాడికి యత్నంపై ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ప్రొద్దువాక గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త ఇద్దరు పిల్లలతో కలసి బడ్డి కొట్టు నిర్వహిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన కూర్మా దేవదాసు బడ్డికొట్టు వద్దకు అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం భర్త, అత్తా లేని సమయంలో దేవదాసు మద్యం సేవించి వచ్చి ఆ మహిళను ఇంట్లోకి లాక్కువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో పరారయ్యాడు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement