ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎఫెక్ట్‌

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

ఎఫెక్ట్‌ ఇసుక అక్రమ రవాణాపై చర్యలు మాయమాటలు చెప్పి రూ.13.50 లక్షలకు టోకరా కలెక్టర్‌కు రెడ్‌క్రాస్‌ అవార్డు

కుక్కునూరు: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మండలంలోని సీతారామ నగరం రెవెన్యూ పరిధిలోని కిన్నెరసాని వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ఈనెల 9న సాక్షి కథనం ప్రచురిచంది. దీంతో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఆదివారం రాత్రి 20 టిప్పర్లలో ఆంధ్ర ప్రాంత ఇసుకను అక్రమంగా తరలించినట్టు వచ్చిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు మధ్యవర్తులతో కలిసి వాగు వద్ద పరిశీలించారు. అక్కడ గుంతల ఆధారంగా ఇసుకను అక్రమంగా తవ్వి తెలంగాణ రాష్ట్రానికి తరలించినట్లు గుర్తించామని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఇసుక తవ్వే యంత్రాన్ని స్వాధీనం చేసుకొని, బూర్గంపాడు మండలానికి చెందిన బత్తా అచ్చయ్య యాదవ్‌, పోతనబోయిన చంద్రరావు, వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

భీమవరం: మాయమాటలు చెప్పి తన కుమారుడు గంధం రామకృష్ణ వద్ద రూ.13.50 లక్షలు కాజేశారంటూ భీమవరం పట్టణానికి చెందిన గంధం హరిప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ ఎస్సై బీవై కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హరిప్రసాద్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. ఆయన అనేక పర్యాయాలు పట్టణంలోని ఎడ్వర్డ్‌ట్యాంక్‌ ప్రాంతంలో జిరాక్స్‌ షాపు నిర్వహిస్తున్న పెన్నాడ శ్రీసత్యకిరణ్‌ వద్దకు వెళ్లడంతో హరిప్రసాద్‌ కుమారుడు రామకృష్ణకు పరిచయమయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకుని శ్రీసత్యకిరణ్‌ అతని భార్య హరిత, అశోక్‌సామ్రాట్‌ నెట్‌సెంటర్‌, ఏటీఎం మెషీన్‌ ఏర్పాటుచేస్తామని మాయమాటలు చెప్పి రామకృష్ణ నుంచి పలు దఫాలుగా రూ.13.50 లక్షలు కాజేశారు. అంతేగాకుండా పి రామరావు, గన్నాబత్తుల వెంకటేశ్వరరావు వద్ద కూడా సుమారు రూ.17 లక్షలు కాజేశారని హరిప్రసాద్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

24న శాప్‌ సెలెక్షన్స్‌

ఏలూరు రూరల్‌: శాప్‌ లీగ్స్‌ పోటీల్లో భాగంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకూ విశాఖపట్టణంలో బాక్సింగ్‌, అనంతరపురంలో ఫుట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపడతామన్నారు. బాక్సింగ్‌ విభాగంలో అండర్‌–15, 19, ఫుట్‌బాల్‌ విభాగంలో అండర్‌–15, 21 బాలబాలికల జట్లు ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. వివరాలకు 94927 01324 సంప్రదించాలని సూచించారు.

భీమవరం (ప్రకాశం చౌక్‌) : రెడ్‌క్రాస్‌ గవర్నర్‌ అవార్డుకు పశ్చిమగోదావరి కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఎంపికయ్యారు. జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వచ్చేనెల 8న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందిస్తారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement