కరెంటు తీగే యమపాశమై.. | - | Sakshi
Sakshi News home page

కరెంటు తీగే యమపాశమై..

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

కరెంటు తీగే యమపాశమై.. తాగునీటి సమస్యలు పరిష్కరించాలి

కొయ్యలగూడెం: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. దిప్పకాయలపాడు దళితవాడకు చెందిన కూనపాము లాజరు (62) కౌలుకి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి వద్ద బట్టల తీగ నుంచి టవల్‌ తీసుకుంటుండగా సర్వీస్‌ వైర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. బంధువులు కొయ్యలగూడెం ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి తరలించగా అప్పటికే లాజర్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెవెన్యూ, విద్యుత్‌ శాఖల అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతానికి రాజస్థాన్‌ వ్యక్తి మృతి

కై కలూరు: భార్య కళ్ల ఎదుటే భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కైకలూరులో సోమవారం చోటుచేసుకుంది. టౌన్‌ ఎస్సై డి.వెంకట్‌కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం రాజస్థాన్‌ రాష్టం బిల్వివార్‌ జిల్లాకు చెందిన ఓప్రకాష్‌ బిలే ఐస్‌క్రీమ్‌, బాదంపాలు తయారు చేసి కై కలూరులో రోజూ బండిపై విక్రయిస్తుంటాడు. కై కలూరు రామాలయం వద్ద భార్య పుఫ్ప్‌ బిలేతో నివసిస్తోన్నాడు. వీరికి 9 నెలల కిత్రమే వివాహమైంది. రోజూవారీ క్రమంలో భాగంగా ఐస్‌క్రీం తయారు చేస్తుండగా సోమవారం మోటారుపై పడడంతో అతడు విద్యుదాఘానికి గురయ్యాడు. భార్య చీపురు కట్టతో వైర్‌ను తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు తెలిపారు. భార్య పుఫ్ప్‌ బిలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.

ఏలూరు రూరల్‌: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సత్యసాయి సీపీడబ్ల్యూఎస్‌ పథకం ద్వారా తాగునీరు అందించే గ్రామాల్లో సమస్యలను సత్వరం పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మశ్రీ అన్నారు. సోమవారం ఏలూరు జెడ్పీ చాంబర్‌లో అధికారులతో కలిసి ఆమె సత్యసాయి పథకం పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైప్‌లైన్‌ సమస్యల తలెత్తినప్పటికీ తాగునీరు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement