నకిలీ విత్తనాలతో నిండా మునిగాం | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

ముంచిన నీటి నిర్లక్ష్యం నకిలీ విత్తనాలతో నిండా మునిగాం కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీకి ఆహ్వానం

ముంచిన నీటి నిర్లక్ష్యం
చేపల, రొయ్యల చెరువుల్లోని నీరు పంట కాల్వలోకి చేరడంతో తాగునీరు కలుషితమవుతోంది. రహదారిపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 8లో u

ఏలూరు (టూటౌన్‌): నకిలీ విత్తనాల వల్ల మోసపోయిన రైతులను ఆదుకోవాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో రైతులు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకముందు కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. వేలేరుపాడు మండలం కట్కూర్‌ పంచాయతీ చిగురుమామిడి. నార్లవరం రైతులు నాసిరకం విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. మిరప విత్తనాలు ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెప్పారని, 70 ఎకరాలపైన సాగు చేశామన్నారు. ఎకరానికి రూ.2 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చే సమయానికి చిన్న చిన్న మిరపకాయలు కాయడంతో దిగుబడి రాలేదదన్నారు. ఎకరానికి కేవలం 2, 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీ సిబ్బంది మిరప చేలు పరిశీలించి విత్తనాల వల్లే ఈ నష్టం జరిగిందని చెప్పి ఎకరానికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా ఒప్పందం చేసుకుని వెళ్లిన తరువాత ఇంతవరకూ స్పందించలేదన్నారు.

నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయంలో నాలుగు, ఐదో తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సోమవారం తెలిపారు. మిగిలిన సీట్లు ఎస్టీ కేటగిరి కావడంతో ఆ కేటగిరికి చెందిన విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తులను కేంద్రీయ విద్యాలయంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement