కబ్జాను అడ్డుకోండి | - | Sakshi
Sakshi News home page

కబ్జాను అడ్డుకోండి

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

కబ్జాను అడ్డుకోండి

కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల వినతి

ఏలూరు(టూటౌన్‌): స్థానిక 41వ డివిజన్‌ చోడిదిబ్బ వద్ద 500 గజాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. కామన్‌ సైట్‌ను కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు చదును చేస్తూ అక్రమంగా లీజుకు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అన్ని రకాలుగా ఉపయోగించుకునేలా కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నూకపెయ్యి సుధీర్‌ బాబు, తుమ్మరాడ స్రవంతి, జిజ్జువరపు విజయనిర్మల, రియాజ్‌, ఇమ్మానుయేల్‌ జైకర్‌, డింపుల్‌ జాబ్‌, నెరుసు చిరంజీవి, జాన్‌ గుర్నాథ్‌, కిలాడి దుర్గారావు, లంకలపల్లి గణేష్‌, ఇనపనూరి జగదీష్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement