వెంచర్‌ దందా మొదలైంది ఇలా.. | - | Sakshi
Sakshi News home page

వెంచర్‌ దందా మొదలైంది ఇలా..

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

వెంచర్‌ దందా మొదలైంది ఇలా..

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత ఈ భూమిపై కన్నేశాడు. హక్కుదారులుగా ఉన్న వాళ్ల దగ్గర అడంగల్‌లో ఒకరి పేరు మినహా ఎలాంటి రికార్డు లేదని తెలుసుకుని భూమిని అమ్మకానికి పెట్టడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారిని బెదిరించి హ ద్దులు మార్చి సర్వే నంబర్లు మార్చి, కాగితాలు సృష్టించి మరీ వెంచర్‌ సిద్ధం చేశారు. ఏడాదిన్నర క్రితమే వెంచర్‌ను ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గజం రూ.14 వేల చొప్పున అనేక మందికి విక్రయించేశారు. ప్రభుత్వ భూమి 50 సెంట్లను కూడా వెంచర్‌లో కలిపేశారు. ఏడుగురు హక్కుదారులను తమదైన శైలిలో బెదిరించి మీ ఎవరికీ ఎలాంటి హక్కు లేదని.. ఉంటే ఒరిజినల్‌ కాగితాలు తీసుకుని రావాలని హడావుడి చేసి, లేని స మస్యను సృష్టించి చివరికి భూమిని తనకే అప్పగించేలా దారికి తెచ్చుకున్నాడు. వీరిలో అందరూ కాకుండా ఇద్దరు సదరు అధికార పార్టీ నేతతో భాగస్వాములుగా మారి భూమి సరిహద్దులను మార్చి సరికొత్త డాక్యుమెంట్లను సృష్టించి విక్రయించారు. ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నం.874లోని భూమిని కూడా 872లో ఉన్న ట్లుగా చూపించి విక్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement