దమ్మున్న కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ సొంతం | - | Sakshi
Sakshi News home page

దమ్మున్న కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ సొంతం

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

దమ్మున్న కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ సొంతం

కై కలూరు: గ్రామ గ్రామాన దమ్ము, దైర్యం కలిగిన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి సొంతమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాలుగు మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులను శనివారం అభినందించారు. కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఎన్నార్‌ మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి 18,000 కార్యకర్తల డేటాను డిజిటలైషన్‌ చేసి రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు. కష్టపడే కార్యకర్తలు ఉండటం వల్లే ఈ ఘనత సాధించానన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్‌ 21 తర్వాత వైఎస్సార్‌సీపీ సత్తా చూపిస్తూ నియోజకవర్గంలో గేర్‌ మారుస్తానన్నారు. అధికంగా పార్టీ కమిటీలను పూర్తి చేసిన వారి జాబితాను ప్రకటించి డీఎన్నార్‌ అభినందించారు. ముదిరాజుల విభాగ పార్టీ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికవ్వడం ఖాయమన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు మాట్లాడుతూ అందరం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కూసంపూడి కనకదుర్గారాణి, ఘంటా సంధ్య, బలే నాగరాజు, గాదిరాజు వెంకట కిషోర్‌ మణికంఠ వర్మ, మండల పార్టీ అధ్యక్షులు బేతపూడి ఏసేబురాజు, బోయిన రామరాజు, తిరుమాని రమేష్‌, దుగ్గిరాల నాగు, సమయం అంజి, పెంటా అనిల్‌కుమార్‌, రాచూరి రాధ, వలవల రామారావు, కందుల వెంకటేశ్వరరావు, చాన్‌ బాషా, వేణుగోపాలరావు, గుడివాడ తంబిస్వామి, కొల్లేటి సత్యనారాయణ, జయమంగళ కాసులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement
 
Advertisement
Advertisement