మహిళల ఉపాధికి ఎసరు | - | Sakshi
Sakshi News home page

మహిళల ఉపాధికి ఎసరు

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

అధ్యాపకుల చిల్లర వేషాలు

న్యూస్‌రీల్‌

వేడి వేడి భోజనానికి విద్యార్థులు దూరం

అధ్యాపకుల చిల్లర వేషాలు
నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో అధ్యాపకులు విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2లో u

శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేశారు. వారంలో ఆరు రోజులూ విభిన్న వంటకాలతో వడ్డించేలా గోరుముద్ద పథకాన్ని అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. అయితే డొక్కా సీతమ్మ పేరును చెడగొట్టేలా కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ పరం చేయడానికి అడుగులు వేస్తోంది. ఇంతవరకూ వంట ఏజన్సీలతో పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్‌ల పేరుతో వారి పొట్టకొట్టడానికి సిద్ధమైపోయిది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏక్తాశక్తి అనే సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించి విద్యార్థులకు భోజనం అందకుండా చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కుట్ర పన్నింది. దీని కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది.

3,195 మంది కుక్‌, హెల్పర్ల ఉపాధికి గండి

వేడివేడిగా విద్యార్థులకు పెట్టడానికి మధ్యాహ్న భోజన ఏజన్సీలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,709 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజన్సీలు పని చేస్తున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి మొత్తం 3,195 మంది కుక్‌, హెల్పర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు ఆలస్యమైనా తమ సొంత డబ్బులతో వంటలు చేసి పిల్లలకు ఆకలి లేకుండా భోజనం అందించేవారు. గతంలో వారికి రూ.1000 గౌరవ వేతనంగా అందించేవారు. ఆ మొత్తం వారికి ఏమాత్రం సరిపోదని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కొక్కరికీ రూ.3 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. 3195 మంది కుక్‌ హెల్పర్ల కుటుంబాలను రోడ్డున పడేసేలా కూటమి ప్రభుత్వం స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటు చేయబోతోంది.

58 స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లాలో 58 స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఒక్కో మండలంలో రెండు స్మార్ట్‌ కిచెన్‌ల చొప్పున జిల్లాలోని 27 మండలాల్లో 58 స్మార్ట్‌ కిచెన్లు (పెద్ద మండలంలో 3 స్మార్ట్‌ కిచెన్లు) ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ స్మార్ట్‌ కిచెన్‌ల ద్వారానే వచ్చే విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం పంపిణీ చేయబోతున్నారు. గతంలో విఫలమైన ఈ విధానాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం కేవలం తమ సామాజికవర్గానికి చెందిన, అలాగే తమ పార్టీకి చెందిన వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటీకరణ దిశగా మధ్యాహ్న భోజన పథకం

జిల్లాలో 58 స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

3,195 మంది కుక్‌, హెల్పర్ల ఉపాధికి ముప్పు

వేడి వేడి భోజనానికి విద్యార్థులు దూరం

ఇంతవరకూ తమ కళ్ళెదుటే వంట చేసి పెడితే వేడివేడిగా తినే విద్యార్థులకు స్మార్ట్‌ కిచెన్‌ల వ్యవస్థ అర్థాకలినే మిగల్చబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో రోజుకు సగటున 10,492 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేసి అక్కడ చేసిన వంటలను మండలంలోని పాఠశాలలకు పంపుతారు. గతంలో ఇలానే ఏక్తాశక్తి అనే సంస్థకు వంటశాలలు ఏర్పాటు చేయడానికి అనుమతులిచ్చి వాటి ద్వారా మధ్యాహ్న భోజనం పంపిణీకి చేసిన ప్రయత్నం వికటించింది. విమర్శల కారణంగా ఏక్తాశక్తి సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సి వచ్చింది. అదే కోవలో స్మార్ట్‌ కిచెన్‌ల వ్యవస్థ సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యారంగ నిపుణులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement