కై కలూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడానికి పార్టీ లీగల్ సెల్ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) సూచిం చారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఏలూరుకు చెందిన చెల్లె రాజేంద్రప్రసాద్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపధ్యంలో కై కలూరు పార్టీ కార్యాలయంలో డీఎన్నార్‌ను రాజేంద్రప్రసాద్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులతో కలసి శుక్రవారం మర్వాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కార్యకర్తలపై తప్పుడు కేసులను ఎదుర్కొడానికి అందరూ సిద్దంగా ఉంటూ, న్యాయ సహాయం అందించాలన్నారు. అనంతరం డీఎన్నార్‌ను న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు బి.జగన్నాథరెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, డి.రామాంజనేయులు, పీ.తంబి, ఓ.సుజాత, సౌజన్య, వాసుదేవరావు, మధు, సంధ్య పాల్గొన్నారు.


