రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 2లో u
స్మార్ట్ కిచెన్‌ల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించ డాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, ఈ నెల 29వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాన్ని రూ. 10 వేలకు పెంచాలి. ప్రతీ నెలా 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి.
ఎం. నాగమణి, మధ్యాహ్న
భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి
కూటమి ప్రభుత్వం అస్మదీయులకు దోచి పెట్టడానికే స్మార్ట్ కిచెన్‌ల వ్యవస్థను తీసుకువస్తోంది. గతంలో వంట ఏజన్సీలకు ఎలాంటి సౌకర్యాలూ కల్పించని ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ కిచెన్లకు ప్రభుత్వ స్థలం ఇవ్వడంతో పాటు కిచెన్ల నిర్మాణానికి రూ.55 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాననడం దేనికి సంకేతమో అందరికీ స్పష్టంగా తెలిసిపోతోంది. వెంటనే స్మార్ట్ కిచెన్‌ల ఆలోచనను విరమించుకోవాలి.
పాతినవలస రాజేష్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు


