పులి పయనం అటా..? ఇటా..? | - | Sakshi
Sakshi News home page

పులి పయనం అటా..? ఇటా..?

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

నంది వాహనంపై ఊరేగిన శివయ్య పులి పయనం అటా..? ఇటా..? కొనసాగిన మట్టి పరీక్షలు

నంది వాహనంపై ఊరేగిన శివయ్య
ద్వారకాతిరుమల: మాసశివరాత్రి పురస్కరించుకుని క్షేత్రపాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారు గురువారం నంది వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు.

పోలవరం రూరల్‌: పెద్ద పులి సంచారం పోలవరం మండలంలో కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పులి తిరిగి అదే ప్రాంతంలో సంచరిస్తోంది. మరలా గోదావరి నది దాటి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటుందేమోనని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం మండలంలోని కోండ్రుకోట పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామ సమీపంలో ముంపు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత ఐదు రోజులుగా పోలవరం మండలంలో వివిధ ప్రాంతాల్లోని అభయారణ్య ప్రాంతాల్లో సంచరించింది. ఒక దూడపై దాడి చేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే ఇది ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపు తిరిగి ప్రయాణం సాగించే పరిస్థితి ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పులికి అమర్చిన రేడియో ప్రీక్వెన్సీ ట్రాకర్‌ ద్వారా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి అడుగుజాడలను గుర్తిస్తున్నారు. దీనిపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే పులి గురువారం నాటికి గోదావరి నదీ తీరంలోని కొత్తూరు ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి గోదావరి నది దాటి వెళ్లే పరిస్థితి ఉందా? లేదా? మరలా వెనక్కి వస్తుందా అనేది తెలియని పరిస్థితులు ఉన్నాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ(సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) బృందం గురువారం రెండో రోజు పరీక్షలు నిర్వహించింది. బృంద సభ్యులు లలిత్‌కుమార్‌ సోలంకి, హనుమాన్‌ ప్రసాద్‌ మీనా పోలవరం ప్రాజెక్ట్‌లో రాతి కట్టడాలను, వాటి నిర్మాణానికి వినియోగిస్తున్న కాంక్రీట్‌ను పరిశీలించారు. జీహిల్‌లో జరుగుతున్న గ్రౌటింగ్‌ను తనిఖీ చేశారు. అక్కడ వినియోగిస్తున్న కాంక్రీట్‌ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్‌, ఎంఈఐఎల్‌ జీఎం గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్య శాస్త్రవేత్తలకు వివరాలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement