విద్యావికాస్‌ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

విద్యావికాస్‌ ప్రభంజనం

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

జంగారెడ్డిగూడెం: ఇంటర్‌ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యావికాస్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు కె.సాయి లక్ష్మి, యు.తౌషిక్‌, సీహెచ్‌ తేజశ్రీ 466 మార్కులు సాధించినట్లు చెప్పారు. 460 మార్కులకు పైబడి 50మంది సాధించారన్నారు. అలాగే బైపీసీ విభాగంలో 455 మార్కులకు ఎం.కేతన్‌శ్రీనాగ్‌, ఎ.లక్ష్మీ సత్యసాయిరిషిత్‌ 450 మార్కులు సాధించారని, 400 మార్కులకు పైబడి 60 మంది సత్తాచాటారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను పి.మాలిని 991 మార్కులు సాధించి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 900కు పైబడి ఎంపీసీ విభాగంలో 147 మంది, బైపీసీలో 26 మంది సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యావికాస్‌ యాజమాన్యం పి.సతీష్‌చంద్‌, వి.శ్రీనివాస్‌, వి.ప్రసన్నలక్ష్మి, పి.లక్ష్మీప్రసన్న, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement