జంగారెడ్డిగూడెం: ఇంటర్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం ఎస్.సత్యనారాయణ, కె.నాగేశ్వరరావు, జి.శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు ఈహెచ్ హరిణి 466 మార్కులు, పి.యశస్విని, ఎన్.దీపిక 465 మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీ విభాగంలో 455 మార్కులకు కె.సుశ్రిత 449 మార్కులు సాధించిందన్నారు. సీనియర్ ఇంటర్‌లో 1000 మార్కులకు గాను ఎంపీసీలో ఎన్.జ్యోతిక 990 మార్కులు, బైపీసీలో పి.లాస్య 988 మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


