ఏసు మార్గం అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

ఏసు మార్గం అనుసరణీయం

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

ఏసు మార్గం అనుసరణీయం నేడు వైఎస్సార్‌సీపీ పూజలు సారవంతమైన భూములు కోల్పోతాం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

మండవల్లి: మండలంలోని భైరవపట్నం ఆర్సీఎం చర్చి వద్ద గుడ్‌ప్త్రెడే సందర్భంగా సిలువ మార్గంలో వైఎస్సార్పీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. డీఎన్నార్‌ మాట్లాడుతూ యేసు బోధించిన కరుణ, జాలి, దయ, ప్రేమ, క్షమలను అందరూ అససరించి, తోటి మానవులకు అపకారం చేయకుండా ఉండాలని సూచించారు. డీఎన్నార్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కైకలూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం సాయంత్రం 4 గంటలకు కై కలూరు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో నాయకులు తప్పక హాజరుకావాలని కోరారు.

జంగారెడ్డిగూడెం: నేవీ ఆయుధ డిపో కారణంగా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని సారవంతమైన భూములు రైతులు కోల్పోవాల్సి వస్తుందని, ఇది ఈ ప్రాంతానికి మంచిది కాదని డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొయ్యలగూడెం మండలంలో 1900 బ్యారెన్‌ల పరిధిలో రైతులు వర్జీనియా సాగు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, పామాయిల్‌తో పాటు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా పండుతాయన్నారు. ఇప్పటికే ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని రైతులు వేలాది ఎకరాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం నేవీ డిపో ఈ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీని కోసం సుమారు 1800 ఎకరాల వరకు అవసరమని, ఇందుకు కొయ్యలగూడెం మండలాన్ని ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. కొయ్యలగూడెం మండలంలో అధిక ఉత్పాదక ఇచ్చే వ్యవసాయ భూములు ఉన్నాయని, వాటిని నేవీ డిపోకు వినియోగిస్తే వ్యవసాయం నాశనం అవుతుందన్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన వారి పరిస్థితి ఏంటన్నారు. నేవీ ఆయుధ డిపో వస్తే ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారని, అది వాస్తవం కాదన్నారు. ఇప్పటికై నా నాయకులు, అధికారులు ఈ ఆలోచనను విరమించుకోవాలని, ఒక వేళ ఇక్కడే పెట్టాలి అనుకుంటే మర్లగూడెం పారెస్ట్‌ భూమిని సేకరించాలని, ఇక్కడ 2 వేల ఎకరాల భూమి ఉందన్నారు.

ఏలూరు (టూటౌన్‌): పోలవరాన్ని సందర్శించి తన జీవితం ధన్యమైందని గవర్నర్‌ చెప్పడం సంతోషకరమైన విషయమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి తెలిపారు. ఆ ప్రాంత గిరిజనుల, ప్రజల అవసరాలు, సమస్యలు గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఆ ప్రాజెక్టుకు భూములిచ్చిన గిరిజనులు, దళితులు, పేదలైన నిర్వాసితులపై లేకపోవడం శోచనీయమన్నారు. నిర్వాసితుల పునరావాసం గురించి ఆలోచన లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,05,000 వరకు ఉన్నాయని, వాటిలో దాదాపుగా 50 శాతంగా ఉన్న 50వేల కుటుంబాలకు చెందిన గిరిజనులు గోడు పట్టించుకొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్‌ నివేదికలో పునరావాసం కేవలం 20 శాతం కూడా కల్పించలేదని, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం 70 శాతం చేసారని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఒకేసారి పరిహారం చెల్లించాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కాగ్‌, సీపీఎం, ఇతర సంస్థలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. నిర్వాసితుల పరిస్థితి ముంపు వాటిల్లినప్పుడు చాలా దయనీయంగా ఉంటుందని, ఆధార్‌ కార్డులు చూసి కొవ్వొత్తులు, మంచినీటి ప్యాకెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈ ప్రాంతంలో గర్నవర్‌ పర్యటించి నిర్వాసితులను కలవాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement