ఆందోళనలో మొక్కజొన్న రైతులు | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలో మొక్కజొన్న రైతులు

Mar 30 2026 8:36 AM | Updated on Mar 30 2026 8:36 AM

ఆందోళనలో మొక్కజొన్న రైతులు నేడు సామూహిక గృహ ప్రవేశాలు 1,047 మందికి ఉచిత ప్రవేశాలు రేపటి నుంచి ‘22ఏ’ గ్రామసభలు నిబద్ధతతో పనిచేసిన ఉమేష్‌ చంద్ర

దెందులూరు: రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్నను పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. కష్టనష్టాలు, విపత్తులను తట్టుకుని మొక్కజొన్నను పండిస్తే మద్దతు ధర అందక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచే యక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధర తగ్గించి దోచుకుంటున్నారన్నారు. ఏలూరు జి ల్లాతో పాటు విజయనగరం, ఎన్టీఆర్‌, బాపట్ల, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాల్లో రై తులు కొనుగోలు కేంద్రాల కోసం పలు రూ పాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని, క్వింటాకు రూ.2,400 ధర చెల్లించాలని కోరారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో పీఎంఏవై, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద సోమ వారం 1,160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో 123, దెందులూరులో 89, ఏలూరులో 502, గోపాలపురంలో 12, కై కలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరులో 52 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): విద్యాహక్కు చట్టం కింద 2026–27కు సంబంధించి ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు జిల్లాలో 1,047 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ పి.శ్యామ్‌సుందర్‌ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ను ఏప్రిల్‌ 7లోపు కేటాయించిన పాఠశా లలో సమర్పించి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తికాకుంటే సీటు రద్దు చేస్తారన్నారు. ఎంఈఓలు తమ పరిధిలో జరిగిన ప్రవేశాల వివరాలను ధ్రువీకరించి, పూర్తి నివేదికను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : జిల్లాలో నిషేధిత భూ ముల జాబితా 22ఏలో నమోదైన జిరాయితీ భూ ములను తొలగించేందుకు చర్యలు తీసుకుంటు న్నట్టు జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులు, భూ యజమానుల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. తొలి దశలో పైలెట్‌ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో మంగళవారం నుంచి ఏప్రిల్‌ 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. భీమవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఏప్రిల్‌ 7 నుంచి 13 వరకు గ్రామ సభలు జరుగుతాయన్నారు. గ్రామ సభల నిర్వహణపై తహసీల్దార్లు ముందుగా ప్రకటనలు చేయాలని, సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయా నికి చెందిన లాండ్స్‌ పర్యవేక్షణ అధికారి ఎం. భానుకుమార్‌, డీటీ ఎ.శివకృష్ణను సంప్రదించాలన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): దివంగత ఐపీఎస్‌ అధి కారి ఉమేష్‌ చంద్ర విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి కొనియాడారు. ఆదివారం స్థానిక వీరమ్మ పార్కు సమీపంలోని ఉన్న ఎన్జీవో హోమ్‌ పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉమేష్‌ చంద్ర 60వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమేష్‌ చంద్ర చిత్రపటం వద్ద కలెక్టర్‌, అధికారులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దిశగా ఉమేష్‌ చంద్ర చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం హోమ్‌లో వృద్ధులను ఆప్యాయంగా పలకరించి భోజన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు అవసరమైన పలు వస్తువులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement