ఏలూరు (టూటౌన్): పెయింటింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించా లని ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏలూరు ఏరియా పెయింటింగ్ కార్మికుల సమావేశం స్థానిక ఇఫ్టూ జిల్లా కా ర్యాలయంలో ఆదివారం యూనియన్ అధ్యక్షుడు లొట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. వక్తలు గా వెంకటేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జి ల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏలూరు న గర అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, 70 నుంచి 80 అడుగుల పైన ఎత్తుకు వెళ్లి రంగులు వేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అ లాగే ప్రస్తుతం ఉన్న కార్మిక పథకాలను పెంచి ఇ వ్వాలని, నిర్మాణంలో ఉన్న బిల్డింగులపై ఒక శాతం సెస్ వసూలును రెండు శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్మా ణ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమ బోర్డును పరిరక్షించాలని కోరారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు బోర్డు నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి జమ చే యాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్స్ ర ద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని అన్నారు. మేసీ్త్రలు గాజర్ల రాము, చిన్నా, దే వదానం, హలీం తదితరులు పాల్గొన్నారు.


