ప్రజల చెవిలో పీ4 పూలు | - | Sakshi
Sakshi News home page

ప్రజల చెవిలో పీ4 పూలు

Mar 30 2026 8:36 AM | Updated on Mar 30 2026 8:36 AM

అధికారులపై తీవ్ర ఒత్తిడి

నరసాపురం: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. ఏ దో అద్భుతం జరిగిపోయిందంటూ హడావుడి చే యడంలో సిద్ధహస్తుడిగా పేరున్న సీఎం చంద్రబా బు రాష్ట్రంలో పేదలను ఉద్దారిస్తామంటూ పీ4 (పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌–పార్టనర్‌ఫిప్‌) కార్యక్రమా న్ని తీసుకువచ్చారు. ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలనకు పీ4 అంటూ హడావుడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా ఏమాత్రం పురోగతి లేకపోగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పీ4 సర్వే ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పీ4 సర్వేలో ఎదురవుతున్న ఆటుపోట్లతో తలలు పట్టుకుంటున్న అధికారులు వార్షికోత్సవాన్ని ఏదో రకంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం సెలవు రోజైనా కార్యక్రమం నిర్వహణపై దృష్టి పెట్టింది. కలెక్టర్‌ నాగరాణి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవన్‌లో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏడు ని యోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలిచ్చారు.

ఏమిటీ పీ4 సర్వే

ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీ4 సర్వే ప్రారంభించింది. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్రతి కుటుంబా న్నీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వారి ఇళ్లలో విలాస వస్తువులు, ఆదాయ మార్గాలు ఇలా పలు అంశాల్లో పడపోత కా ర్యక్రమం నిర్వహించాలన్నది సర్వే లక్ష్యం. తద్వారా బంగారు కుటుంబాల పేరుతో సంపన్న వర్గాలను గుర్తించి వారిని మార్గదర్శకులుగా నియమించి కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకునేలా చే యాలనేది కార్యక్రమం ఉద్దేశం. ఇలా సంపన్న వర్గా లు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా చే యూత ఇవ్వడం, అవసరమైన నైపుణ్యాలు పెంచడానికి సహకరించడం చేయాలి. చెప్పడానికి ఇదంతా బాగున్నా.. సర్వే దశలోనే ఈ కార్యక్రమం అట్టర్‌ఫ్లాఫ్‌ అయ్యింది.

టార్గెట్‌ ఘనం..

మార్గదర్శకులు దొరకని వైనం

జిల్లాలో 4,92,292 కుటుంబాలను సర్వే చేసి ద త్తతకు అర్హమైన 64,940 కుటుంబాలను అధికారు లు తేల్చారు. అయితే ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంపన్న వర్గాలైన మార్గదర్శకులు 15 వేల మంది కావాలి. అయితే ఏడాది కాలంలో మార్గదర్శకులు ఎంత మందిని గుర్తించారనే అంశంలో జిల్లా అధికార యంత్రాంగం వద్ద స్పష్టత లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కనీసం 3 వేల కు టుంబాలను కూడా గుర్తించలేదని తెలిసింది. మరి సర్వే లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకమే. పబ్లిసిటీలో పీక్‌గా పేరున్న చంద్రబాబు పీ4 సర్వే విషయంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హవ్వ.. ఇదెక్కడి విడ్డూరం ?

పీ4 సర్వే పేరుతో సీఎం చంద్రబాబు హడావుడి

నేడు ప్రథమ వార్షికోత్సవానికి సన్నాహాలు

జిల్లాలో మార్గదర్శకులు దొరకని వైనం

కార్యక్రమం విజయవంతానికి అధికారుల పాట్లు

పీ4 సర్వేకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార తీరుతో తొలి నుంచి అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మార్గదర్శకులుగా చెప్పే బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది. కలెక్టర్‌ తరచూ ఇదే అంశంపై రివ్యూలు నిర్వహించడంతో అధికారులు విసిగిపోయారు. అయినా జిల్లాలో మార్గదర్శకులను రిజిస్టర్‌ చేయించడం అధికారుల వల్ల కాలేదు. దీంతో వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఉందని గుర్తించిన చంద్రబాబు సర్కారు ఓ దశలో ఈ బంగారు కుటుంబాల బాధ్యతను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు అప్పగించాలని కూడా నిర్ణయించింది. ఒక్కో అధికారి, ఉద్యోగి జీతంలో నెలకు రూ.5 వేలు ఖర్చు చేయించేలా ప్రయత్నం జరిగింది. చివరకు సర్వే విఫలం విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులను చేసేలా సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం, ఒత్తిడి పెంచడం వంటివి కూడా చేశారు. అయితే ప్రభుత్వ చర్యలను మొదటిగా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. తర్వాత మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సర్వే లక్ష్యం అమలు సాధ్యం కాదని ధిక్కార స్వరం పెంచారు. మొత్తంగా అటు ప్రజల నుంచే కాకుండా ఇటు అధికారులు, మేధా వుల నుంచి తీవ్ర వ్యతిరేకతతో అభాసుపాలైన పీ4 సర్వేకు వార్షికోత్సవం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement