మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుకు పితృవియోగం | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుకు పితృవియోగం

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

ఉండి: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు పితృవియోగం జరిగింది. ఆదివారం వేకువజామున ఉండి మండలం యండగండిలోని ఆయన నివాసంలో చెరుకువాడ వెంకట నర్సింహరాజు (96) తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సూర్యకాంతమ్మ, ఇద్దరు కుమారులు శ్రీరంగనాథరాజు, బంగార్రాజు, కుమార్తె విజయ ఉన్నారు. నర్సింహరాజు భౌతికకాయాన్ని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి, సీనియర్‌ నాయకులు కనుమూరు అబ్బాయిరాజు, ఆ కివీడు ఏఎంసీ మాజీ చై ర్మన్‌ వానపల్లి బాబూరా వు, కవిటం ఎంపీపీ వా సిరెడ్డి, పార్టీ నేత యడ్ల తాతాజీ, ఆచంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement