‘ఆడబిడ్డ’కు చంద్రబాబు ద్రోహం
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో చంద్రబాబు పా లనలో మహిళలు ‘రుణమో రామచంద్రా’ అని అ భ్యర్థిస్తున్నారు.. పథకాలు అందక.. ఉపాధికి మా ర్గాలు లేక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడం, ఆర్థిక సాధికారత, స్వావలంబనకు ఊతమివ్వకపోవడంతో ఉసూరుమంటున్నా రు. దీంతో మహిళాభ్యున్నతి పూర్తిస్థాయిలో కుంటుపడింది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేసేందుకు కృషి చేశారు. డ్వా క్రా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాలు అందించారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, చేదోడు, జగనన్న తోడు వంటి పథకాలతో ఆర్థికంగా అండగా నిలిచారు. ప్ర భుత్వ అండతో చిరు వ్యాపారాలు, డెయిరీ యూ నిట్లు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, కుటీర పరిశ్రమల నిర్వహణ వంటివి మహిళలు చేపట్టారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఈ పరిస్థితి కానరావడం లేదు. ఈ నేపథ్యంలో పాత రోజులే బాగున్నాయని మహిళలు అంటున్నారు. చంద్రబాబు, కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయామంటూ నిట్టూరుస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో స్వయం సమృద్ధి
2014–19 కాలంలో ఉమ్మడి జిల్లాలో డ్వాక్రా మ హిళలకు రూ.13,451.50 కోట్ల రుణాలు ఇచ్చారు. ఏలూరు జిల్లాలో 1,42,456 గ్రూపులకు రూ.7,682.40 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,04,576 గ్రూపులకు రూ.5,753.10 కోట్లు రుణాలుగా అందించి స్వయం సమృద్ధికి దోహదపడ్డారు. అయితే ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఈ స్థాయిలో బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. దీనిపై మహిళలు పెదవి విరుస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏటా నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశారు. ఏలూరు జిల్లాలో సగటున ఏటా 164.89 శాతం, పశ్చిమగోదావరి జిల్లా లో 177.69 శాతం బ్యాంకు రుణాలు అందించారు.
రుణమాఫీతో ఆదుకుని..
వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్సార్ ఆసరా పథకంలో డ్వాక్రా మహిళలకు రూ.2,300 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. ఏలూరు జిల్లాలో 3.50 లక్షల మందికి పైగా మహిళలకు రూ.1377.16 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పశ్చిమగోదావరి జి ల్లాలో సైతం మూడు లక్షల మందికి పైగా మ హిళలకు రూ.వెయ్యి కోట్ల మేరకు లబ్ధి కలిగింది.
‘కాపు’కాసిన నేస్తం
వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో ఒక్కో ఏడాది రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి జిల్లాలో కాపు మహిళలకు రూ.220 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఏలూరు జిల్లాలో 66,488 మందికి రూ.100.45 కోట్లు, పశ్చిమలో లక్ష మందికి రూ.1,20 కోట్ల మేర సహకారం లభించింది.
మెండైన చేయూత
వైఎస్సార్ చేయూత పథకంలో ఉమ్మడి జిల్లాల పరిధిలోని మహిళలకు రూ.850 కోట్ల మేరకు లబ్ధి చే కూరింది. ఏలూరు జిల్లాలో 1,00,776 మందికి నా లుగు విడతల్లో కలిపి రూ.440 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 95 వేల మంది మహిళలకు రూ.410 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు.
అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకుని..
గత వైఎస్సార్‌సీపీ పాలనలో అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు విడతల్లో రూ.45 వేలు అందించారు. ఏలూరు జిల్లాలో 15,047 మందికి రూ.68.68 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 14 వేల మందికి 63 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.
అతివకు అన్యాయం
చంద్రబాబు పాలనలో అందని భరోసా
పథకాల్లేవ్.. ఉపాధికి బాటల్లేవ్
కుంటుపడిన మహిళా సాధికారత
వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళాభ్యున్నతికి పెద్దపీట
నాటి రోజులే బాగున్నాయంటున్న సీ్త్రమూర్తులు
చంద్రబాబు, కూటమి నాయకులు ఎన్నికల ముందు సూపర్ సిక్స్, పథకాల పేరుతో మహిళలను వంచించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలను అ మలు చేయలేదు. దీంతో మహిళలు ఆర్థిక భరోసా కోల్పోయారు. ఎప్పటిలాగానే ప్రతి చిన్న అవసరానికీ ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో పథకం ద్వారా మ హిళల చేతుల్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పాలనే బాగుండేదని, ప్రస్తుతం తమకు ఎలాంటి పథకం అందకపో వడంతో వెంపర్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు.


