● తాడేపల్లిగూడెంలో తాగునీరు వృథా
● లీకేజీలతో నీరు కలుషితం
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణంలో పలుచోట్ల పైప్‌లైన్ లీకేజీలతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీరు వృథా కావడంతో పా టు కుళాయిలు నుంచి మురుగు నీరు, దుర్వాసన వస్తుందని ప్రజలు ఆందేన చెందుతున్నారు. ప్ర ధాన పైప్‌లైన్లతో పాటు ఇళ్లకు వెళ్లే పైప్‌లైన్‌లకు సైతం లీకేజీలు పడుతున్నాయి. కొన్నిచోట్ల డ్రెయిన్ల వద్ద పైప్‌లైన్లు ఉండటంతో తాగునీటి పైపుల ద్వా రా మురుగునీరు వస్తుందని పలువురు అంటున్నా రు. తక్షణమే సంబంధిత అధికారులు పైప్‌లైన్ల లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద..
స్థానిక పెద్ద మసీదు సెంటర్ నుంచి టీటీడీ కల్యాణ మండపం రహదారి మార్గంలో ఈతకోట తాతాజీ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద కాంప్లెక్స్‌కు సంబంధించిన పైప్‌లైన్‌కు సీసీ రోడ్డుకు దిగువన లీకేజీ పడింది. చాలా కాలంగా నీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి పరిశీలించారు. రోడ్డుకు అవతల వైపు ప్రధాన పైపులైన్ వద్ద ఇతర పైప్‌లైన్లను సరిచేసేందుకు గొయ్యి తవ్వారు. ఎందుకు తవ్వారు తెలియరాలేదని స్థాని కులు అంటున్నారు. ఇప్పటికీ పైప్‌లైన్ లీకేజీని మాత్రం అరికట్టలేదు. ఇదిలా ఉండగా లీకేజీని అరికట్టేందుకు సీసీ రోడ్డును పగలగొట్టాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు.
అంబేడ్కర్ భవనానికి
ఎదురు సందులో..
మసీదు సెంటర్ అంబేడ్కర్ భవనానికి ఎదురుగా ఎంపీపీ పాఠశాల పక్క సందులో ఓ పైప్‌లైన్‌కు లీకేజీ పడింది. ఈ పైప్‌లైన్ డ్రెయినేజీ వద్ద ఉండటంతో లీకేజీ ద్వారా మురుగు నీరు పైప్‌లైన్‌లోకి వెళుతోందని స్థానికులు అంటున్నారు.
ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రం
ఎదురుగా..
జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా రోడ్డు పక్కగా డ్రెయినేజీకి సమీపంలో ఓ స్థలం వద్ద పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. నీరు వృథాగా పోతోంది. ఆయా సమస్యలపై అధికారులను వివరణ కోరగా లీకేజీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద..
అంబేడ్కర్ భవనం ఎదురు సందులో..
మున్సిపల్ కాంప్లెక్స్ వద్ధతవ్వి వదిలేసిన గొయ్యి


