వ్యాపారులు, కేంద్రంతో చర్చిస్తాం | - | Sakshi
Sakshi News home page

వ్యాపారులు, కేంద్రంతో చర్చిస్తాం

Mar 26 2026 7:48 AM | Updated on Mar 26 2026 7:48 AM

వ్యాపారులు, కేంద్రంతో చర్చిస్తాం రైతులను మోసం చేయడమే ఎవరూ పట్టించుకోవడం లేదు ●

ఈ సీజన్‌లో ఎన్‌ఎల్‌ఎస్‌లో 48.75 మి.కిలోలు లక్ష్యం కాగా 80 మి.కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా. బుధవారం ప్రారంభమైన వేలంలో ధరపై రైతులు అసంతృప్తి ప్రకటింంచి మద్దతు ధర లభించలేదని నిరసన తెలిపారు. దీనిపై వ్యాపారస్తులు, కేంద్రంతో చర్చించి, వారికి మద్దతు ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. రైతుల పొగాకు పంట చివరి ఆకు వరకు అమ్మించేందుకు కృషి చేస్తా.

– సి.యశ్వంత్‌కుమార్‌, చైర్మన్‌, పొగాకు బోర్డు

గతేడాది ప్రారంభ ధర రూ. 290తో వేలం మొదలై, గరిష్టంగా రూ.456 వరకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం తొలిరోజు వేలంలో ప్రారంభం ధర రూ. 265 ధర ఇవ్వడం రైతులను కంపెనీలు మోసం చేయడమే. ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం క్రాప్‌ హాలిడే తీసుకుని ఈ పంటను రెండు సంవత్సరాలు అమ్ముకుంటామని కంపెనీలకు తెలియజేస్తున్నాం.

– వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకుడు

ప్రారంభ ధర రూ.350 వస్తుందని ఆశిస్తే రూ.265 ఇచ్చారు. పొగాకు బోర్డు అధికారులు, కేంద్ర ప్రభుత్వం కలిసి సరాసరి రూ.350 వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికై నా పొగాకు బోర్డు, కేంద్రం స్పందించి రైతుకు న్యాయం చేయాలి. మద్దతు ధర ఇవ్వలేనప్పుడు పొగాకును పూర్తిగా బ్యాన్‌ చేయండి. మేము వేరే పంటల వైపు వెళతాం.

– పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement